చిన్నారి ఆపరేషన్ కోసం సాయం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో.. చిరు సాయమని చెబుతూ?

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్( GV Prakash Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

నటుడిగా కెరీర్ పరంగా ప్రకాష్ కుమార్ బిజీగా ఉన్నారు.

చిన్నారి ప్రాణాల కోసం ఈ స్టార్ హీరో 75,000 రూపాయలు సాయం చేయగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ 25 ఏళ్ల వయస్సులోనే 25 సినిమాలకు మ్యూజిక్ అందించారు.

ఒకవైపు సినిమాలతో కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను పంచుకుంటున్నారు.సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పే విషయంలో జీవీ ప్రకాష్ కుమార్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే ఒక వ్యక్తి తన సోదరి బిడ్డ వయస్సు ఏడాది అని ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ తో( Brain Tumor ) బాధ పడుతోందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

Advertisement

ఆ వ్యక్తి తన పోస్ట్ లో ఆన్ లైన్ లో ఈ విధంగా ఆర్థిక సహాయం( Financial Help ) అడగడం ఇబ్బందిగా ఉందని అయినప్పటికీ ఆ బిడ్డ ప్రాణాల కోసం ఎలాగైనా అడుగుతానని కామెంట్లు చేశారు.ఆపరేషన్ కు రూ.4 లక్షలు ఖర్చు అవుతోందని మా ఫ్యామిలీ 2 లక్షల రూపాయలు సిద్ధం చేసిందని మీకు తోచినంత సహాయం చేయాలని కోరారు.ఈ పోస్ట్ జీవీ ప్రకాష్ దృష్టికి రావడంతో ఆయన వేగంగా స్పందించారు.

జీవీ ప్రకాష్ కుమార్ 75,000 రూపాయలు పంపడంతో పాటు నా నుంచి ఇది చిరు సాయమని చెప్పుకొచ్చారు.జీవీ ప్రకాష్ కుమార్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అయ్యారు.జీవీ ప్రకాష్ కుమార్ కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకుంటూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు