సొంతిల్లు లేదు.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. ఎమ్మెల్యేగా 15 ఏళ్లు చేసిన ఈ వ్యక్తి కథ మీకు తెలుసా?

దేశంలోని రాజకీయ నాయకులు అంటే దాదాపుగా అందరూ కోటీశ్వరులే అని చాలామందిలో భావన ఉంది.

కొంతమంది రాజకీయాల్లో గెలవక ముందు కోటీశ్వరులు కాకపోయినా గెలిచిన తర్వాత వేర్వేరు మార్గాల్లో సంపాదించిన సందర్భాలు ఉన్నాయి.

యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri ) జిల్లాలోని గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన గుర్రం యాదగిరిరెడ్డి రామన్నపేటకు 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు.ప్రజల కోసం పని చేసిన గుర్రం యాదగిరిరెడ్డి( Gurram yadagiri reddy ) 2019 సంవత్సరం నవంబర్ నెల 22వ తేదీన గుండెపోటుతో మరణించారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా హైదరాబాద్ లో యాదగిరిరెడ్డికి సొంతిల్లు లేదు.కుమారుల ఇంట్లోనే ఆయన ఉండేవారు.

స్వగ్రామం సుద్దాలలో ఆయనకు కేవలం పెంకుటిల్లు మాత్రమే ఉండేది.ఆయనకు మూడెకరాల పొలం ఉండగా ఆ పొలం కూడా పెద్దలు సంపాదించిన పొలం కావడం గమనార్హం.

Advertisement

గుర్రం యాదగిరిరెడ్డికి కారు, ఇతర వాహనాలు కూడా ఉండేవి కావు.ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సామాన్య ప్రజల కష్టాలను తీర్చి యాదగిరిరెడ్డి ప్రశంసలు అందుకున్నారు.ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో కూడా ఎలాంటి హంగూ అర్భాటాలు లేకుండా జీవనం సాగించడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.

కెరీర్ తొలినాళ్ల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ( Communist party ) సిద్ధాంతాలతో ఆయన రాజకీయాల్లో మనుగడ సాగించారు.తెలంగాణ సాయుధపోరులో ఆయన కీలక పాత్ర పోషించారు.గెరిల్లా దళంలో పని చేయడం వల్ల ఆయనకు పింఛన్ కూడా రాలేదు.

నేటి తరానికి చెందిన ఎంతోమందికి ఆయన మార్గదర్శిగా నిలిచారు.యాదగిరిరెడ్డి గెరిల్లా శిక్షణ పొంది 14వ ఏటనే దళానికి ఆర్గనైజర్ అయ్యారు.1985, 1989, 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు.యాదగిరిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు.

యాదగిరిరెడ్డి రైతు సంఘం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా కూడా పని చేయడం గమనార్హం.

ర‌క్త‌హీన‌త వేధిస్తుందా.. నీర‌సంగా ఉంటుందా.. అయితే ఈ జ్యూస్ మీకే!
Advertisement
" autoplay>

తాజా వార్తలు