గుంటూరు కారం నుండి మరో ఇద్దరు అవుట్.. ముందుకెళ్లడం కష్టమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం.

( Guntur Kaaram ) ఈ సినిమా ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసారో తెలియదు కానీ అప్పటి నుండి వాయిదా పడుతూనే ఉంది.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తప్పుకుని జనవరిలో స్టార్ట్ అవ్వగా రెండు షెడ్యూల్స్ చేయగానే మళ్ళీ సమ్మర్ ముందు ఆగిపోయింది.

ఇక ఈ మధ్యనే స్టార్ట్ చేసి మరో షెడ్యూల్ చేసారు.షెడ్యూల్స్ అయితే పూర్తి అవుతున్నాయి కానీ సినిమా మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు.అంతేకాదు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి టీమ్ నుండి ఎవరో ఒకరు బయటకు వెళ్తూనే ఉన్నారు.

ముందు కెజిఎఫ్ మాస్టర్స్ వర్క్ నచ్చలేదని వారిని తప్పించారు.ఆ తర్వాత పూజా హెగ్డేతో తీసిన సీన్స్ సైతం పక్కన పెట్టేసారు.ఆమెకు కూడా సెటిల్ చేసేసారు.

Advertisement

మళ్ళీ మధ్యలో థమన్ తో వివాదం అని తెరపైకి వచ్చింది.ఆ తర్వాత కెమెరా మాన్ పీఎస్ వినోద్ కూడా తప్పుకున్నారు.

ఇక ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ బయటకు వెళ్లినట్టు టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇలా వరుస వార్తలు వస్తున్న నేపథ్యంలో నెటిజెన్స్ ఇదేమైనా బిగ్ బాస్ హౌస్ నా వారం వారం తప్పుకోవడానికి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో రామ్ లక్ష్మణ్ ( Ram Lakshman )వర్క్ పూర్తి అవ్వడంతో వెళ్లిపోయారనే రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి.ఇందులో ఏవి నిజమో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.కాగా ఈ సినిమాలో శ్రీలీల,( SreeLeela ) మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు