ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్... ఇప్పుడు మాత్రం క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా మందికి నటులు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారే.

చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించి ఆ తర్వాత చదువుల నిమిత్తం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి ఇస్తున్నారు.

అలా ఇప్పటికే ఎంతోమంది సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అలాంటివారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టార్ హీరోయిన్ కూడా ఒకరు.

రజినీకాంత్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన లింగ సినిమాలో( Lingaa Movie ) చిన్న పాత్రలో నటించింది.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఇందులో అనుష్క శెట్టి సైతం నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

లింగ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా.ఆమె మరెవరో కాదండోయ్ అమృత అయ్యర్.

( Amritha Aiyer ) కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ మెప్పించింది అమృత.ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

అమృత అయ్యార్ పదైవీరన్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.అలాగే రామ్ పోతినేని జోడిగా రెడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

అలాగే యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?( 30 Rojullo Preminchadam Ela ) అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడా..?
మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఈమె కష్టానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

తెలుగులో అర్జున ఫల్గుణ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి హనుమాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా( Hanuman Movie ) భారీ విజయాన్ని అందుకుంది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొత్తంగా 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Advertisement

దీంతో అమృతకు సైతం గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం ఈమె చేతుల్లో రెండు మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన ఈమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.

తాజా వార్తలు