తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి కీర్తి భట్( Keerthi Bhat ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో చాలా సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ షో కి( Bigg Boss Show ) ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయ్యింది.
ఇక పండుగ సమయంలో అలాగే మామూలు సమయాలలో వచ్చే ఈవెంట్లలో షోలలో పాల్గొంటూ సందడి సందడి చేస్తూ ఉంటుంది.కానీ కీర్తి జీవితం వైపు ఆ విధి చిన్నచూపు చూసిందని చెప్పాలి.
రోడ్డు యాక్సిడెంట్ లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది కీర్తి.అమ్మానాన్న, అన్నయ్య.
ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.తన తల్లిదండ్రి ఫ్యామిలీ అందరూ దూరమైనప్పటికీ కృంగిపోకుండా మనసును గట్టి చేసుకుని జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలని అనుకుంది.
మొదట కన్నడ టీవీ సీరియల్స్ లో నటించింది.కన్నడ సినిమాలలో కూడా నటించింది.మొదట తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్ లో( Manasichi Choodu Serial ) నటించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.అయితే యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంది.కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు.
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి.
త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్‌న్యూస్ చెప్పింది.హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్ ను( Vijay Karthik ) వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది.
అదే ఏడాది విజయ్ తో ఎంగేజ్‌మెంట్ జరిగింది.ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది.
నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లు అవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు.తాజాగా కీర్తి కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది.అయితే ఆ వీడియో చూసిన ఒక నెటిజన్.మిస్ కన్నడ కీర్తి గారు.పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు.
కార్తీక్ కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్ లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు.ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు.
దీనికి కీర్తి స్పందిస్తూ.పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.