అమ్మమ్మను చంపిన మనవడు.... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు...

ఈ మధ్యకాలంలో చాలామంది కిరాతకులు పుట్టుకొస్తున్నారు.బయటనే కాకుండా సొంత వాళ్ళలోనే ఏదో ఒక రూపంలో కిరాతకులు మన మీదికి దాడి చేస్తున్నారు.

డబ్బు కోసం, ఆస్తి కోసం హత్యలకు పాల్పడుతున్నారు.అయితే తాజాగా ఓ మనవడు తన అమ్మమ్మను డబ్బు కోసం హత్య చేశాడు.

ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది.ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

చెన్నై లోని కోరుకుప్పెట్‌లో రూ.లక్ష కోసం అమ్మమ్మను సుత్తి, బ్లేడుతో దారుణంగా హత్య చేశాడు మనవడు.చెన్నైలోని కోరుకుప్పెట్‌కు చెందిన విశాలాక్షి కారుమారియమ్మన్ నగర్‌లో ఉంటున్నారు.

Advertisement

ఆమెకు అముద అనే కుమార్తె ఉంది.ఆమెకు సతీష్ అనే కుమారుడు ఉన్నాడు.

గతంలో విశాలాక్షి తన కూతురు అముదకు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇచ్చింది.ఇందులో ఆమె కూతురు విశాలాక్షికి 3 లక్షలు తిరిగి ఇచ్చింది.

మిగిలిన లక్ష రూపాయలను తిరిగి ఇవ్వలేదు.అముద ఇంకా ఆమె కుమారుడు సతీష్, బుధవారం తల్లి ఇంటికి వచ్చారు.

ఆ సమయంలో విశాలాక్షి తన కూతురుకి మిగిలిన లక్ష రూపాయలు తిరిగి ఇవ్వమని కోరింది.దీంతో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరగడంతో తల్లితో పాటు వచ్చిన సతీష్ ఆవేశానికి లోనై అమ్మమ్మ విశాలాక్షిని ఇంట్లోని సుత్తితో కొట్టి, బ్లేడును ఉపయోగించి దాడి చేశాడు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

నిందితుడు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన విశాలాక్షి వాళ్ల దాడిని భరించలేక కేకలు వేసింది.అప్పటికే ఆమె శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో రక్తం ఎక్కువగా పోయింది.విశాలాక్షి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను కాపాడి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement

అయితే వెళ్ళేదారిలోనే విశాలాక్షి మృతి చెందింది.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

మృతురాలు విశాలాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసి అమ్మమ్మను హత్య చేసిన మనవడు సతీష్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

తాజా వార్తలు