గ్రామ పంచాయితీ కార్మికులు నిరసన మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపిన కార్మికులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రములో ఎంపిడిఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది.

జిపి కార్మికులు కళ్ళు మూసుకొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మండల సీఐటీయూ కన్వీనర్ గురీజల శ్రీధర్( Gurijala Sridhar ) మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులు పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.గ్రామపంచాయతీ కార్మికులతో గ్రామాలలో అన్ని పనులను చేయిస్తూ, కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన పట్టంచుకోడం లేదని,మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి,పాత విధానాన్ని అమలు చేయాలి.

గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యంగా గ్రామపంచాయతీ కార్మికులపై వేధింపులు మానుకోవాలని తదితర డిమాండ్లతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల గ్రామ పంచాయతీ కార్మికులు అక్కనపల్లి లక్ష్మణ్, సంతపూరి సుమన్, కొట్టే కమలాకర్, కొండవేని నాగరాజు, పరశురాములు, నరేష్, సుమతి, దుర్గవ్వ, బాబు తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News