లండన్‌లోని అంబేద్కర్ ఇంటి వివాదం: భారత్ విజయం, మ్యూజియంగానే ఉంచుకోవచ్చన్న యూకే

స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బ్రిటన్ రాజధాని లండన్‌లో నివసించిన ఇల్లు మూసివేతకు సంబంధించిన కేసులో భారత్ విజయం సాధించింది.

అంబేద్కర్ హౌస్‌‌ను మ్యూజియంగా నడపడానికి వీల్లేదంటూ అనుమతి తిరస్కరించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌‌ను యూకే పరిగణనలోనికి తీసుకుని విచారించింది.

అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నోటీసును రద్దు చేస్తూ యూకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.భారత ప్రభుత్వం తరపున సింఘానియా అండ్ కోకు చెందిన జన్ జీవన్ జాన్ సవాల్ చేశారు.

దీనిపై గతేడాది సెప్టెంబర్ 24, అక్టోబర్ 11 న విచారించింది.ఈ వివాదాన్ని విచారించిన ఇన్స్‌పెక్టర్ కె.విలియమ్సన్‌ అంబేద్కర్ ఇంటిని మ్యూజియంగానే ఉంచాలని 2019 డిసెంబర్ 4న ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించారు.ఈ ఏడాది మార్చి 12న విలియమ్సన్‌ను నివేదికకు ఆమోదముద్ర వేసిన బ్రిటన్ ప్రభుత్వం అంబేద్కర్ హౌస్‌ను మ్యూజియంగా మార్చడానికి అనుమతించింది.

మ్యూజియంను ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తెరచి వుంచాలని అలాగే నిర్వహణ ప్రణాళికను 6 నెలల్లోగా ఆమోదించి 14 నెలల్లోపు అమలు చేసుకోవచ్చునని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ నిర్ణయాన్ని 28 రోజుల్లోగా హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపింది.

Advertisement

దీనిపై కమ్యూనిటీస్ సెక్రటరీ రాబర్ట్ జెన్రిక్ గురువారం మహారాష్ట్ర అప్పీల్‌ను అనుమతిస్తూ ట్వీట్ చేశారు.‘‘ ఆధునిక భారతదేశ పితామహులలో ఒకరైన డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ ఇండియన్లకు ముఖ్యమైన వ్యక్తి అని, లండన్‌లోని మ్యూజియం నిర్వహణకు అవసరమైన ప్రణాళికకు అనుమతి ఇవ్వడానికి తాను సంతోషిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.డాక్టర్ అంబేద్కర్ 1921- 1922 మధ్య కాలంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటూ ప్రైమ్ రోజ్ హిల్ ప్రాంతంలో నివసించారు.అంబేద్కర్ మహారాష్ట్ర వాసి కావడంతో లండన్‌లో ఆయన నివసించిన ఇంటికి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 36.5 లక్షల పౌండ్లు ( భారత కరెన్సీలో ముప్పై కోట్ల రూపాయలు) కు కొనుగోలు చేసి దానిని మ్యూజియంగా మార్చింది.2015 ఫిబ్రవరిలో ఈ భవనాన్ని కొనుగోలు చేయగా.అదే ఏడాది నవంబర్ 14న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.

నాటి నుంచి అంబేద్కర్ మ్యూజియాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.వారాంతాల్లో అయితే ఇది రెట్టింపుకు చేరుకుంటోంది.

ఈ క్రమంలో ఆవాస ప్రాంతాల్లో మ్యూజియం వుండకూదని, సందర్శకులు రాత్రీ పగలూ తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వచ్చిపోతూ చేస్తున్న అల్లరి వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇద్దరు స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా గ్రేటర్ లండన్‌ మున్సిపల్ కార్పోరేషన్‌లో భాగమైన కామ్రేడ్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.

పిటిషన్‌దారుల వాదనతో ఏకీభవిస్తూ అంబేద్కర్ హౌస్ బిల్డింగ్‌ ప్లాన్‌లో లోపాలున్నాయని కౌన్సిల్ గుర్తించింది.మ్యూజియం నిర్వహణకు అనుమతి తీసుకోకుండా అక్కడ దీనిని నిర్వహిస్తున్నారని నిర్ధారిస్తూ, మ్యూజియం మూసివేతకు ఉత్తర్వులిచ్చింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

అంబేద్కర్ హౌస్‌ను మ్యూజియంగా నడపటానికి కౌన్సిల్ అనుమతి తిరస్కరించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది.

Advertisement

తాజా వార్తలు