డివైజ్ ట్రాకింగ్ కోసం గూగుల్ సరికొత్త డివైజ్.. ప్రత్యేకతలు ఇవే

యాపిల్ యూజర్లు ఎయిర్ ట్యాగ్ ఫీచర్ ద్వారా తమ గ్యాడ్జెట్లను కనుగొంటారు.ఎక్కడైనా మార్చిపోతే ఈ ఫీచర్ వారికి ఉపయోగపడుతుంది.

‘ఫైండ్ మై ఫీచర్’ యాప్ మీ పరికరాల లొకేషన్‌ను సజావుగా ట్రాక్ చేయడానికి సహాయ పడుతుంది.అవి పోయినట్లయితే, తిరిగి పొందడం ఇది ఉపయోగపడుతుంది.

ఇప్పుడు, Google కూడా యాపిల్ బాటలోనే లొకేషన్ ట్రాకింగ్ పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.దీనికి Grogu, Groguaudio లేదా GR10 అనే పేర్లు పరిశీలిస్తోంది.

గూగుల్ ఫాస్ట్ పెయిర్‌లో లొకేషన్ ట్రాకింగ్‌ను చేర్చడానికి దీనిపై బాగా కృషి చేస్తోంది.ఇది సమీపంలోని బ్లూటూత్ పరికరాలను త్వరగా యాడ్ చేయడానికి టెక్ దిగ్గజం దీనిని రూపొందిస్తోంది.

Advertisement

Google Nest బృందం దీనిని డెవలప్ చేస్తోంది.ట్రాకర్ వివిధ రంగులలో అందుబాటులో ఉండవచ్చని మరియు స్పీకర్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.సౌండ్ సహాయంతో వినియోగదారులు తమ తప్పిపోయిన పరికరాలను గుర్తించడంలో సహాయపడుతుంది.

Apple యొక్క AirTag తరహా ఫీచర్‌ను అందిస్తుంది.ఇది ఎయిర్‌ట్యాగ్‌ల మాదిరిగానే ఆన్‌బోర్డ్ స్పీకర్‌ను కలిగి ఉంది.

ఇది కొన్ని విభిన్న రంగులలో కనిపిస్తుంది.ఆండ్రాయిడ్ పరిశోధకుడు కుబా వోజ్సీచోవ్స్కీని ఈ వివరాలు వెల్లడించాడు.

Google ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ Android పరికరాలను కలిగి ఉన్నందున Find My Device యాప్‌ని మెరుగుపరచడానికి పని చేస్తోంది.ట్రాకింగ్ పరికరం సహాయంతో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను గుర్తించడానికి వీటిని ఉపయోగించవచ్చు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అల్ట్రా-వైడ్ బ్యాండ్ కనెక్టివిటీని కూడా ఉంచింది.ఇది పోగొట్టుకున్న/దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సాంకేతికతను ఉపయోగించడాన్ని కూడా సూచిస్తుంది.

Advertisement

కానీ ఇది ట్రాకింగ్ పరికరంతో కలిసి పనిచేయడానికి ఉపయోగించవచ్చు.అయితే గూగుల్ ఎయిర్ ట్రాకర్ వల్ల కొంత మంది దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.

దీని సాయంతో నేరాలు చేసే ప్రమాదం ఉంది.

తాజా వార్తలు