స్కూల్ పిల్లలకి గుడ్ న్యూస్.. 20 శాతం మేర సిలబస్ తగ్గింపు

ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సుమారు పదిహేను నెలలుగా పుస్తకాలు , పాఠశాలకు దూరంగా ఉన్న చిన్నారి విద్యార్థులకు ఈ విధంగా సంవత్సరంలో కొంతైనా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఒక్కసారిగా వారిని చదువు కోసం బలవంతం పెట్టకుండా ఉండేలా సరికొత్త నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం 2021-2022 విద్యా సంవత్సరానికి మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే  విద్యార్థులకు సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వీరభద్రుడు సర్క్యులర్ జారీ చేసారు.మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు 15 శాతం.10వ తరగతి కి 20 శాతం వరకు సిలబస్ తగ్గించింది.అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో పాఠశాల పని దినాలను తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ 31 వారాల నుంచి 27 వారాలకు  కుదించారు.

Good News For School Children .. Syllabus Discount Of 20% , Syllabus , Good New

ఈ మేరకు రెండు భాగాలుగా అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన చేశారు.రాష్ట్రంలో కరోనా కారణంగా మూతబడిన స్కూలు ఆగస్టు 16 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పట్ల, టీచర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఆదేశించారు.

Advertisement
Good News For School Children .. Syllabus Discount Of 20% , Syllabus , Good New

కరోనా బారిన పడిన విద్యార్థులకు వెంటనే వైద్య చికిత్స అందించాలని  అందుకు అనుగుణంగా వైద్యులు ఆస్పత్రుల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇంతాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడా పాఠశాలల విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.

  విద్యార్థుల తల్లిదండ్రులు ఒకింత భయపడుతూనే స్కూలుకి పంపుతున్నరు.కరోనా భూతం చిన్నారులకు ఇబ్బంది పెడుతూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే విద్యార్థుల పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని ప్రభుత్వం పేర్కొంది.

డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..
Advertisement

తాజా వార్తలు