ఈ ఫేస్‌ ఆయిల్ తో సూపర్ గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ మీ సొంతం!

ఆడవారే కాదు మగవారు కూడా తమ ముఖ చర్మం(Facial skin) అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.

అందుకోసం ఎన్నెన్నో స్కిన్ కేర్(skin care) ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

ప్రతినెలా వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అయితే సహజంగానే సూపర్ గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్(Super glowing and healthy skin) ను మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ ఫేస్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఆరు నుంచి ఏడు కుంకుమపువ్వు రేకులను(Saffron petals) వేసుకోవాలి.ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ (Olive oil)వేసుకోవాలి.

Advertisement
Get Super Glowing And Healthy Skin With This Face Oil! Face Oil, Glowing Skin, H

అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె(Sesame Oil), వన్ టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్ (Jojoba Oil)మరియు ఐదు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక రోజంతా వదిలేయాలి.దాంతో మన ఫేస్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది.

ఒక బాటిల్ లో ఈ ఫేస్ ఆయిల్ ను స్టోర్ చేసుకోవాలి.

Get Super Glowing And Healthy Skin With This Face Oil Face Oil, Glowing Skin, H

రోజు నైట్ నిద్రించే ముందు లేదా ఉదయం స్నానం చేయడానికి గంట ముందు ఈ ఆయిల్ ను ముఖానికి అప్లై చేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.కుంకుమ పువ్వు మొటిమలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.

మొండి మచ్చలను నివారిస్తుంది.మరియు స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

మహేష్ ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే... సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి!
అఖండ సీక్వెల్ కు బోయపాటి శ్రీను రికార్డ్ రెమ్యునరేషన్.. లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఆలు ఆయిల్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.

Advertisement

సన్ డ్యామేజ్ కు గురైన స్కిన్ ను రిపేర్ చేస్తుంది.మొటిమలు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

జోజోబా ఆయిల్ స్కిన్ డ్రై అవ్వకుండా కాపాడుతుంది.చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.స్కిన్ ను హెల్తీగా గ్లోయింగ్ గా మారుస్తుంది.

నువ్వుల నూనె స్కిన్ వైట్నింగ్ లో సహాయపడుతుంది.స్కిన్ పీహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

విటమిన్ ఇ సన్ బర్న్ మరియు సన్ డ్యామేజ్ వల్ల కలిగే దురదలను నివారించడంలో హెల్ప్ చేస్తుంది.స్కిన్‌ను మాయిశ్చరైజ్ చేస్తుంది.

హైపర్పిగ్మెంటేషన్ ను త‌గ్గిస్తుంది.ఫైనల్ గా ఈ ఫేస్ ఆయిల్ ను వాడటం వల్ల మీ చర్మం యవ్వనంగా కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

తాజా వార్తలు