తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట్లో ట్వీట్ వైరల్!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతుండగా పెళ్లైన సెలబ్రిటీలు తల్లిదండ్రులు అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మరొక బాలీవుడ్ జంట కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు.

వారు మరెవరో కాదు నటి, బాగ్‌బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్.తాజాగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

ఈ సందర్భంగా ఆ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ మేము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అంటూ ఆమె భర్త జైద్ దర్బార్‌ తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ సందర్బంగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది.

అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నటి ,మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్, ఆమె భర్త జైద్ దర్బార్ వారి మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Advertisement

ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు.ఆ వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.

గౌహర్ ఖాన్, జైద్ దర్బార్ కలిసి ఇద్దరయ్యాం.ఇప్పుడు మేము త్వరలో ముగ్గురం అవుతాం.

ఈ సాహసం మరింత ముందుకు సాహసం సాగుతుంది.ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం అని రాసుకొచ్చారు.

కాగా గౌహర్, జైద్ ల ప్రేమ కథ విషయానికి వస్తే.ఈ జంట కరోనా మహమ్మారి సమయంలో గౌహర్, జైద్ ఒక కిరాణా దుకాణంలో మొదటిసారి కలుసుకున్నారు.ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లో స్నేహితులుగా చాట్ చేసుకున్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు డేటింగ్ కొనసాగించారు.అలా కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట చివరకు డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకోని ఒక్కటయ్యారు.

Advertisement

తాజా వార్తలు