మిడ్ మానేరు నుంచి ఎల్.ఎం.డి. రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసిన గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా : మ‌ధ్య‌ మానేరు నుంచి దిగువ మానేరు జ‌లాశ‌యానికి రాష్ట్ర బీ.సీ.

సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సోమవారం నీటిని విడుదల చేశారు.ఈ సంద‌ర్భంగా బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ మండు టెండ‌ళ్ళల్లోనూ, వర్షాభావ పరిస్థితుల్లోనూ కాళేశ్వ‌రం జ‌లాలు రాష్ట్రానికి వరప్రదాయినిగా మారాయి.

మేడిగ‌డ్డ నుంచి ఎత్తిపోత‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి ఉండ‌క‌ పోతే.ఈరోజు తెలంగాణ ప‌రిస్థితి ఎలా ఉండేదో ఊహకు కూడా అందేది కాదు.ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ కింద చేప‌ట్టిన కాళేశ్వ‌రం ఎత్తి పోత‌ల ప‌థ‌కం ఫ‌లితాలు ఈరోజు ప్ర‌జ‌ల కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తోంది.

వ‌ర్షం లేక‌పోయినా.ఈరోజు వ‌ర‌ద కాలువ నిండు కుండ‌లా ప్రవహిస్తోంది.

Advertisement

కాళేశ్వ‌రం జ‌లాల‌తో ఇప్ప‌టికే శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టులో దాదాపు మూడు టీఎంసీల నీటితో నింపాం.వ‌ర‌ద‌ కాలువలో 122 కిలోమీట‌ర్ల పొడ‌వు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.వ‌ర‌ద‌ కాలువ ద్వారా 80 చెరువులను నింపుతున్నాం.

వ‌ర‌ద‌ కాలువ చుట్టూ భూగ‌ర్భ‌ జ‌లాలు పెరిగి అన్న‌దాత‌ల‌కు క‌ల్ప‌త‌రువుగా మారింది.వర్షాభావ పరిస్థితుల నేప‌థ్యంలో కాళేశ్వ‌రం జ‌లాలతో సాగుకు ధోకా లేకుండా పోయింది.

రైతాంగానికి చింత లేకుండా పోయింది.ముఖ్యంగా వర్షం కోసం ఆకాశం వైపు చూడాల్సిన ప‌ని లేకుండా పోయింది.

ప్ర‌ధానంగా క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాల‌కు కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ద్వారా అధిక లాభం జ‌రుగుతోంది.వ‌ర‌ద కాలువ ద్వారా శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టుకు ఎత్తిపోస్తున్న కాళేశ్వ‌రం జ‌లాల వ‌ల్ల మొద‌ట‌గా ల‌బ్ధి పొందేది క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లానే త్వ‌ర‌లోనే వ‌ర‌ద‌ కాలువ‌ను కాక‌తీయ కెనాల్‌ డీ - 86 కు లింకు చేయ‌బోతున్నాం.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

త‌ద్వారా పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతాల‌కు కూడా కాళేశ్వ‌రం జ‌లాలు అందుతాయి.వ‌ర‌ద‌ కాలువ‌ను నాడు వ‌ర‌ద‌కు మాత్ర‌మే వినియోగించారు.

Advertisement

కానీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు సాగునీటి రంగంపై ఉన్న అపార అనుభంతో.కాలువ‌ను బ‌హుళ ప్ర‌యోజ‌నాలు ఇచ్చే క‌ల్ప‌త‌రువుగా మార్చారు.

ఇదే కాలువ ద్వారా ఆటు ఎగువ‌కు, ఇటు దిగువ‌కు నీరు అందించడం గొప్ప విషయం.చుక్క వ‌ర్షం కురియ‌క‌ పోయినా.

కాళేశ్వ‌రం జ‌లాలు ఉన్నాయ‌న్న ధీమాతో.ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు.

మ‌ధ్య‌మానేరు నుంచి దిగువ మానేరుకు నీటిని ఈరోజు విడుద‌ల‌ చేశాం.ప్ర‌స్తుతం నాలుగు గేట్లు ఎత్తాం.

క్ర‌మేపీ గేట్ల సంఖ్య పెంచి నీటి స్థాయిని పెంచుతాం.ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు సంపూర్ణంగా సాగునీటికి నీరు అందిస్తాం.

రైతులు, రాష్ట్ర హిత‌మే ల‌క్ష్యంగా.త‌క్కువ స‌మ‌యంలో ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తిచేసి.

సాగునీటి రంగ చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డు సృష్టించారు.వాటి ఫ‌లితాలు ఇప్ప‌డు ప్ర‌జ‌ల క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి.

తెలంగాణ రైతాంగం, స‌మాజం అలోచించాల్సింది ఒక్క‌టే.మ‌న‌కు నీళ్లు ఇచ్చే ప్ర‌భుత్వం కావాలా .? సాగునీరు, రైతుబందు, ఉచిత క‌రెంటు ఇస్తూ.రైతును రాజు చేసే ప్ర‌భుత్వం కావాలా.?నిజానికి స‌మైక్య రాష్ట్రంలోనే కాళేశ్వ‌రం లాంటి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఉండి ఉంటే.తెలంగాణ ప్రాంత రైతులు అత్మ‌హ‌త్య‌లు చేసుకునేవారా.? ఒక్క‌సారి ఆలోచ‌న చేయాలి.అనంతరం రాష్ట్ర బీ.సీ.సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ జులై మాసం సగం పూర్తయిన వర్షాలు ఎప్పుడు వస్తాయా అని రైతులు దినంగా మొగులు వైపే దిగాలుగా, నిరాశగా చూస్తున్నారు.కాలం పోతున్న వర్షాలు పడితే .నాట్లు వేస్తామని చూస్తున్నారు.లక్షలాది ఎకరాల లో పంట సాగు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

కాలం ఎట్టిపోయినా, కాలం కలిసి రాకపోయినా కాలేశ్వరం కలిసి రావాలని సీఎం కేసీఆర్ భావించారు.కాలేశ్వరం ప్రాజెక్టుతో వర్షా భావ పరిస్థితుల్లో రైతులు మొగులు వైపు చూసే బాధను తప్పించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పుడు.వర్షా బావ పరిస్థితులు తలెత్తిన సందర్భంలో రైతులు తమ భూములను బీడు పెట్టుకునే దుస్థితి ఉండేది.

రైతాంగాన్ని ఆదుకునేందుకు మధ్య మానేరు జలాశయం నీటిని విడుదల చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, నన్ను, ఎమ్మెల్యే లను ఆదేశించారు.వారి ఆదేశాలతో నేడు ఎం ఎం ఆర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసాము.

రైతు బిడ్డగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం.ప్రస్తుతం ఎంఎంఆర్ లో 15 టిఎంసిల నీరు, ఎల్ఎండి లో 7 టిఎంసిల నీరు ఉంది.

మొత్తం 22 టిఎంసిల నీరు ఉంది.ఎల్ఎండి దిగువన రైతులు 9.5 లక్షల ఎకరాలలో సాగు కోసం వేచి చూస్తున్నారు.వర్షా భావ పరిస్థితుల్లో 9.5 లక్షల ఎకరాలలో సాగు కోసం 50 టిఎంసిల నీరు దశల వారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎం ఎం ఆర్ నీరు నింపుకుంటూ.

ఎల్ ఎం డి నీ నింపుకుంటాo.ఎం ఎం ఆర్ ,ఎల్ ఎం డి లలో చెరో 20 టి ఎం సి ల నీరు ను నింపుకుంటాo.

ఆ తర్వాత 25 వ తేదీ నుంచి ఎల్ ఎం డి దిగువన సూర్యాపేట జిల్లా వరకూ నీటినీ పంపిస్తాం.అదే మాదిరి ఎల్ ఎం డి పైన ప్రాంతానికి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగుచేల జలాలను అందిస్తాం.

సిఎం కేసిఆర్ ముందు చూపుతో కాళేశ్వరo ప్రాజెక్టు నిర్మించకపోతే నేర్రెలు వారిన ఎం ఎం ఆర్ ,ఎల్ఎండి ని, బీడు భూములను చూసేవాళ్ళం .గతంలో ఈ పరిస్థితిని మనం చూసాం.కాలేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకుంటుంది.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, సుడా చైర్మన్ జీ.వీ.ఆర్., కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఇళ్లంతకుంట వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News