రామ్ చరణ్ ఓపికకు పరీక్ష పెడుతున్న గేమ్ చేంజర్ మేకర్స్...

రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయాల్లోనే స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా మారాడు.

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద తన మార్క్ ను చూపిస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి.

ఇక రాజమౌళి( Rajamouliతో చేసిన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత ఆయన శంకర్ తో గేమ్ చేంజర్ అనే ) సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా దాదాపు మూడు సంవత్సరాల నుంచి సెట్స్ మీదనే ఉంది.అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ అయితే రావడం లేదు.ఇక ఇప్పటికే ఈ సినిమాతో విసిగిపోయిన రామ్ చరణ్ రిలీజ్ మీద క్లారిటీ రాకపోవడంతో సినిమా యూనిట్ మీద అరుస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

ఇక దానికి తోడు గా రామ్ చరణ్ మీద కమలహాసన్ అభిమానులు కూడా విపరీతమైన కామెంట్లు అయితే చేస్తున్నారు.తను శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేయడం వల్లే ఇండియన్ 2( Indian 2 ) సినిమా లేటవుతుంది అంటూ వాళ్లు చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ కూడా గేమ్ చేంజర్( Game Changer ) సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రావడం లేదు.ఈ మధ్య ఫస్ట్ సింగల్ గా ఒక సాంగ్ వచ్చినప్పటికీ అది పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అసలు శంకర్ రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనే అనుమానాలు కూడా రామ్ చరణ్ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు