గూడెంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంను గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సమన్యాయం దక్కుతుందని అన్నారు.

ఈ బిఆర్ఎస్ 9 యేండ్ల పాలనలో దగా మోసాలు తప్ప చేసిందేమీ లేదున్నారు.అలాగే పుట్టబోయే పాపకు 1,50, 000అప్పు చేసి పెట్టాడనీ, దళిత సీఎం లేడు, దళితులకు మూడెకరాల భూమి లేదు, దళిత బంధు కేవలం బిఆర్ఎస్ కార్యకర్తలకు అందుతుందనీ అన్నారు.

వరి వద్దు ఉరి ముద్దు అన్న ఈ ప్రభుత్వాన్ని మనం ఉరి వేయాలనీ పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.

అలాగే పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తు, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు.కౌలు రైతులకు 15000,వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు ఏటా ఇస్తామని అన్నారు.

Advertisement

ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని అన్నారు.అలాగే గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఇస్తామన్నారు.

అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలము, ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తామని, ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామన్నారు.నిరుద్యోగులకు ప్రత్యేక జాబ్ కాలెండర్ నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

యువ వికాసం పథకం కింద ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.మెగా డీఎస్సీ కూడా నిర్వహిస్తాము అని సందర్భంగా తెలియజేశారు.

చేయూత పథకం ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు 4000 రూపాయల పింఛన్ అందిస్తామన్నారు.అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు అందజేస్తామన్నారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఉందని, అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ చెబితే చేస్తుంది దానికి నిదర్శనమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి ఎల్లా గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా కో కన్వీనర్ గంగాధరి రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తాలరీ నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వంగ మోహన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సడిమల బాలయ్య, ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగ మాద్రి సత్యానందం, బూత్ కమిటీ అధ్యక్షులు కుంట రమేష్,ఓదెల శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెలుముల రాంరెడ్డి, వుచిడి బాల్ రెడ్డి,కరెడ్ల కొండల్ రెడ్డి, గూడా లక్ష్మారెడ్డి,ఎక్కాల దీవి మహేష్ యాదవ్, నారాయణరెడ్డి,వడ్డేపల్లి మల్లయ్య, గద్దల బాబు, తాటి పెళ్లి పరుశరాములు, గురు స్వామి గడ్డం మహేందర్, ఎరుపుల హరీష్ కుమార్ యాదవ్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News