భారీ ధరకు ఆర్ఆర్ఆర్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన జీ 5..ఏకంగా అన్ని కోట్లా?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ .

ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది.

ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈనెల 25వ తేదీ ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మ్యూజిక్, సినిమా టీజర్ అభిమానులలో మరింత ఆసక్తిని పెంచేశాయి.ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవ్ గన్, శ్రీయ వంటి ప్రముఖులు నటించారు.

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఓటిటి అప్డేట్స్ గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement
G5 Bought Rrr Ott Rights For A Huge Price Do You Know How Many Crores RRR, Tolly

ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయటానికి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీగా డబ్బులు వెచ్చించినట్టు సమాచారం.

G5 Bought Rrr Ott Rights For A Huge Price Do You Know How Many Crores Rrr, Tolly

ఆర్ఆర్ఆర్ ఓటిటి రైట్స్ కోసం జీ5 సంస్థ ఏకంగా భారీ మొత్తంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్ట్రీమింగ్‌ హక్కులతో పాటు హిందీకి సంబంధించి శాటిలైట్‌ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం.ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చిన 90 రోజుల తర్వాత అంటే జూన్ రెండవ వారంలో ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషలకు సబందించి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు