కిషన్ దాస్ పేట కు హెల్త్ సబ్ సెంటర్ కు నిధులు మంజూరు

16 లక్షల రూపాయలతో సబ్ సెంటర్ నిర్మాణం.స్థల పరిశీలన చేసిన గ్రామస్థులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట కు 16 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా అట్టి నిర్మాణం కిష్టంపల్లి లో నిర్మాణం చేయడానికి కిష్టంపల్లి లో గ్రామస్థులతో కలిసి ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేశారు.ఈ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం తో కిషన్ దాస్ పేట, కిష్టంపల్లి వాసులకు వైద్యం అందుబాటులోకి రానుందని కిషన్ దాస్ పేట, కిష్టంపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

నిధుల కేటాయింపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నర్సయ్య కు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మ రెడ్డి కి,తాజా మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి కి తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ కు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి,తాజా మాజీ వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మీ నారాయణ, కిష్టంపల్లి వాసులు పేంజర్ల సత్తయ్య యాదవ్,గుడి విఠల్ రెడ్డి,పయ్యావుల రాజు యాదవ్,పయ్యావుల దేవయ్య యాదవ్,గుడి సత్యం రెడ్డి,జీడి రాజు యాదవ్,మొగుళ్ళ బాలయ్య కాంట్రాక్టర్ రాదారపు శంకర్ లు పాల్గొన్నారు.

పోలీసుల సహకారంతో స్టాఫర్ల ఏర్పాటు
Advertisement

Latest Rajanna Sircilla News