సంపద వనాలలో రెండు వారాల్లో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ఆగస్టు 10 నాటికి బీసి కులవృత్తుల లక్ష రూపాయల ఆర్థిక సహాయం మొదటి దశ పంపిణీ పూర్తి రెండవ దశ దళిత బంధు( Dalit Bandhu ) పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి నోటరీ డాక్యుమెంట్ లపై పట్టణాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలి రాజన్న సిరిసిల్ల జిల్లా :రాబోయే రెండు వారాల్లోగా అన్ని జిల్లాల్లోని సంపద వనాల్లో పూర్తి స్థాయిలో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

సోమవారం ఆమె హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీ లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళితబంధు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని అన్నారు.ప్రతివారం జిల్లాలో 100 గొర్రెల యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గొర్రెల కొనుగోలు, లబ్ధిదారులకు పంపిణీ, గొర్రెలకు బీమా సౌకర్యం కల్పన, తదితర అంశాలు పకడ్బందీగా జరగాలని సూచించారు.

బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 చొప్పున ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆగస్టు 10 లోపు చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని, ఎమ్మెల్యేలతో చర్చించి వారి సమయం తీసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన గడువు వివరాలు తెలియజేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మొదటి దశ బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆగస్టు 10 లోపు పూర్తి కావాలని ఆదేశించారు.మైనార్టీ సంక్షేమ శాఖ కింద జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

గృహలక్ష్మి పథకం క్రింద జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆగస్టు 10 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మి క్రింద 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, గృహలక్ష్మి పథకం( Gruha Lakshmi A )పై గ్రామస్థాయిలో డప్పు చాటింపు ద్వారా ప్రచారం నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.

Advertisement

రెండవ దశలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు.ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద క్రమబద్ధీకరణ కోసం ఎంపికైన లబ్దిదారుల నుంచి రుసుము వసూలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.

ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతించిందని అన్నారు.ఆన్ లైన్ మీ సేవా ద్వారా నోటరి భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను స్వీకరించి, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraag Jayanti ), అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాఘవేందర్, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఉద్యానవన అధికారిణి జ్యోతి, మైనారిటీ కార్యాలయ ఓఎస్డీ సర్వర్ మియా, సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News