తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చట్టసభలపై కేసీఆర్ కు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు.
బడ్జెట్ సమావేశాలు పదకొండు రోజులు మాత్రమే నిర్వహించారన్న ఈటల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అయితే కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించారని విమర్శించారు.ఈ ఏడాది మొత్తంలో 14 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయని ఈటల తెలిపారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.అనంతరం ధరణి పోర్టల్ వ్యవస్థపై స్పందించిన ఈటల ప్రభుత్వం దాన్ని పేదల కోసం కాకుండా పెద్దల కోసమే ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు.







