ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ బడికి - బడి ప్రారంభమైన రోజే పాఠశాలలో చేరిక

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రైవేట్ పాఠశాల లు వద్దు .ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదం తో ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్చాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ దంపతులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

దాంట్లో భాగంగానే ఎల్లారెడ్డిపేట కు చెందిన దీటి హర్షిని మండలకేంద్రంలోనీ ఓ ప్రైవేట్ పాఠశాల లో ఐదవ తరగతి వరకు చదువుకుంది.ఆరవ తరగతి లో సకల హంగుల తో మంత్రి కేటిఆర్ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పాఠశాలలో చేర్పించాలని ఉపసర్పంచ్ దంపతులు విద్యార్థిని తల్లిదండ్రులు దీటి బాల్ లక్ష్మి - సతీష్ లకు సూచించగా సోమవారం హర్షిని 6వ తరగతి లో అడ్మిషన్ పొందింది.

కాగా ప్రభుత్వ పాఠశాలలలో తన కూతురును చేర్పించినందుకు హర్శిని తల్లి బాల్ లక్ష్మి నీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ దంపతులు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,గరుగుల స్వామి,గరుగుల కృష్ణహారి లు ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News