ఆట ప‌ట్టించిన వ‌రుడి స్నేహితులు.. కోపంతో వ‌ధువు ఏం చేసిందంటే..

పెండ్లిలో ఈ మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో ఎంత‌లా పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

అయితే ఇందులో కొన్ని ఫ‌న్నీగా ఉంటే మ‌రికొన్ని మాత్రం చాలా సీరియ‌స్‌గా ఉంటున్నాయి.

ఇందులో కొన్ని క‌న్నీళ్లు కూడా పెట్టిస్తున్నాయి.అయితే పెండ్లిని చాలామంది గ్రాండ్ గా జ‌రుపుకోవాల‌ని అనుకుంటున్నారు.

అందులో భాగంగా చేసే కొన్ని డిఫ‌రెంట్ ప‌నులే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతున్నాయి.ఎందుకంటే పెండ్లి అనేది ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఒకేసారి వ‌స్తుంది క‌దా అందుకే ఇలా డిఫ‌రెంట్ గా చేసుకుంటున్నారు.

మ‌రి రొటీన్‌గా చేసుకుంటే మజా ఏం ఉంటుంది చెప్పండి.అందుకే చాలా గ్రాండ్ గా అలాగే డిప‌రెంట్ కాన్సెప్ట్‌తో చేసుకుంటున్నాయి ఇప్ప‌టి జంటలు.

Advertisement

ఒక‌ప్పుడు పెండ్లి అంటే చాలా సింపుల్ గా జ‌రిగిపోయేవి.కానీ ఇప్పుడు మాత్రం డ్యాన్సులు, భ‌ర‌త్ లు అంటూ దుమ్ములేపేస్తున్నారు.

పైగా పెండ్లి మంట‌పాల ద‌గ్గ‌ర మాత్రం స్నేహితుల ఆట‌ప‌ట్టించ‌డాలు మాత్రం చాలా పెరిగిపోయాయి.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి స్నేహితుల ఆట ప‌ట్టించ‌డం గురించి తెలుసుకుందాం.

ఓ పెళ్లి వేడుకలో వ‌ధువు, వ‌రుడు దండ‌లు మార్చుకుంటున్నారు.

అఇయ‌తే వ‌రుడి స్నేహితులు ఊరుకుంటారా చెప్పండి.వారి ప‌నిలో వారు ప‌డ్డారు.వ‌ధువును ఆట ప‌ట్టించేందుకు ఆమె దండ వేస్తున్న స‌మ‌యంలో స్నేహితులు వ‌రుడిని వెనక్కు లాగారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అప్పటికే చాలా సీరియ‌స్ గా ఉన్న వ‌ధువు కాస్తా వారు చేస్తున్న ప‌నికి చిర్రెత్తుకుని వ‌చ్చింది.ఇంకేముంది వారు చేస్తున్న ప‌నికి పెళ్లికొడుకును తిట్టిపోసింది.క‌రెక్టుగా నిల్చోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.

Advertisement

అయినా విన‌కుండా స్నేహితులు అలాగే వెనక్కు లాగ‌డంతో సహనం కోల్పోయిన వ‌ధువు అలాగే దండను అత‌డి మెడ‌లోకి విసిరేసింది.ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

దీనిపై ర‌క‌ర‌కాల కామెంట్లు వ‌స్తున్నాయి.

తాజా వార్తలు