కళ్లు మూసుకుంటే గిఫ్ట్ ఇస్తానని చెప్పి గొంతుకోసి పరారైన యువతి ....

ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలకు వయసుతో సంబంధం లేకుండా తన కూతురు స్నేహితురాలితో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆమె చేతిలోనే దారుణంగా హత్య చేయబడ్డ ఘటన తమిళనాడులో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని సొత్తుమానగర్ ప్రాంతంలో  శేఖర్ అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో నివాసం ఉంటున్నాడు.

అయితే తన కూతురి స్నేహితురాలాయినటువంటి ఓ యువతి తరచు వాళ్ళ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది.ఈ క్రమంలో ఆ యువతిని ఎలాగైనా లొంగదీసుకోవాలనే క్రమంలో శేఖర్ ఆమెకు ఖరీదైన బహుమతులు ఇస్తూ ఆమెకు దగ్గరయ్యాడు.

అయితే బహుమతుల మోజులో పడ్డ యువతి శేఖర్ తో శారీరకంగా లొంగిపోయింది. దీంతో ఆమెకు కావలసిన వస్తువులు కొనిపిస్తూ ఉండేది.

అందుకు బదులుగా ఆ యువతి అతడి లైంగిక వాంఛను తీర్చేది.

Friend Father In Tamilnadu Sekhar
Advertisement
Friend Father In Tamilnadu Sekhar-కళ్లు మూసుకుంటే �

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆ యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కావున ఇకపై నాతో కలవడం కుదరదని చెప్పింది.దీంతో ఆగ్రహానికి గురైన శేఖర్ తాము ఏకాంతంగా గడిపిన సమయంలో కొన్ని ఫోటోలు తీసుకున్నామని ఆ ఫోటోలను బయటపెడతానని బెదిరించసాగాడు.దీంతో ఆ యువతి శేఖర్ ని చంపాలని పథకం వేసింది.

ఆ పథకం లో భాగంగా అతడిని బయటకు తీసుకెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రాంతంలో బండి ఆపింది.ఆ తర్వాత కళ్లు మూసుకుంటే మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది దాంతో అతడు కళ్ళు మూసుకో గానే అతడిపై మత్తు మందు చల్లింది.

మెల్లగా మత్తులోకి జారుకోగానే గొంతు కోసి పరారైంది.  అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా యువతిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించింది.

దీంతో ఆమెను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు