2021 లో నాలుగు గ్రహణాలు.. మరి ఇండియాలో కనిపించేవి రెండే..!

2020 వ సంవత్సరంలో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో రెండు సూర్య గ్రహణాలు కాగా, నాలుగు చంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ ఏడాది 2021 లో ప్రపంచం మొత్తం నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి.వీటిలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణంతో కలిపి మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి.

ఈ నాలుగులో భారతదేశంలో కేవలం రెండు గ్రహణాలు మాత్రమే కనువిందు చేస్తాయని ఉజ్జయిన్‌కు చెందిన జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ రాజేంద్రప్రకాష్ గుప్త్ తెలిపారు.ఈ ఏడాదిలో మొదట చంద్రగ్రహణం మే 26న పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలలో చంద్రగ్రహణం కనువిందు చేయనుంది.

సూర్యుడు చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రుని కాంతి భూమిపై పడకుండా ఏర్పడే గ్రహణాన్ని చంద్రగ్రహణం అంటారు.భూమి 101.6 శాతం చంద్రుడిని కప్పివేస్తుందని రాజేంద్ర ప్రకాష్ తెలియజేశారు.అదేవిధంగా జూన్ 10 తేదీన ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని తెలిపారు.

Advertisement

సూర్యుడు, భూమికి మధ్య లో చంద్రుడు అడ్డుగా రావడం వల్ల సూర్యుని కాంతి భూమి పై పడకుండా చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణం అంటారు.జూన్10 తేదీన సూర్యుడు 94.3 శాతం ఆవరించడంతో ‘అగ్ని వలయం’ గా ఏర్పడనుంది.ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు.

నవంబర్ 19 న ఏర్పడే పాక్షిక చంద్ర గ్రహణం మన భారతదేశంలో కనిపించనుంది.అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలలో కొంత సమయం వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.2021 సంవత్సరం చివరగా ఏర్పడే గ్రహణం డిసెంబర్ 4న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.

ఈ ఏడాది మొత్తంలో ఏర్పడిన నాలుగు గ్రహణాలలో కేవలం రెండు చంద్ర గ్రహణాలు మాత్రమే భారతదేశంలో కనువిందు చేయనున్నట్లు రాజేంద్రప్రసాద్ గుప్తా తెలిపారు.

రవితేజ ఎన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు..?
Advertisement

తాజా వార్తలు