జేసీ ప్రభాకర్ రెడ్డి పై తన శైలికి భిన్నంగా హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి పల్లె..

శ్రీ సత్యసాయి జిల్లా.

తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై తన శైలికి భిన్నంగా హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి పల్లె నిన్ను చూస్తుంటే బాహుబలి సినిమాలో కాలకేయునిలా ఉన్నావ్.

జగన్ దయాదాక్షిణ్యాలతో మున్సిపల్ చైర్మన్ అయ్యాను అని చెప్పుకునే నీకు పార్టీపై ప్రేమ ఉందా కల్లు తాగిన కోతిలా ఉంటుంది జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి అని జనాలు అంటున్నారు.నువ్వు ఒక బఫూన్ అని ఆల్రెడీ ముద్రపడింది ఇంకా ఎందుకు దిగజారి మాట్లాడతావ్.

Former Minister Palle Made Hot Comments On J.C Prabhakar Reddy Contrary To His S

నా టిక్కెట్ సంగతి పక్కన పెట్టు ముందు నువ్వు టికెట్ చేసుకో చూద్దాం అంటూ సవాల్.దారి కూడా సక్రమంగా నడవలేని నువ్వు నా గురించి మాట్లాడతావా.

సహాయకులు లేకుండా 50 మీటర్లు నువ్వు నడిచి చూపిస్తే చాలు నీకు గండపెండేరం తొడుగుతా తాడిపత్రిలో నాకు అభిమానులు ఉన్నారు ఆయన ఇక్కడకు వచ్చి పెత్తనం చెలాయించడం లేదే నాకంటే సమర్ధుడు ఆర్థికంగా బలంగా ఉన్న వాడు వస్తే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు.నిన్న మొన్న పార్టీలోకి వచ్చి ఏళ్ల తరబడిగా పార్టీలో ఉన్న మాపైనే పెత్తనం ఏంటి.

Advertisement

పార్టీ బాగు కోసం ఎంతకైనా తెగిస్తా.నోటి దురద ఉన్న రాజకీయ నాయకుడు బాగు పడినట్లు చరిత్రలో లేదు మనం మనం విమర్శలు చేసుకుంటూ ఉంటే నికార్సైన టిడిపి కార్యకర్తలు కుమిలిపోతున్నారు ఇప్పటికైనా ఈ వివాదానికి తెర దించి నీ పని నువ్వు చూసుకో.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు