నిజామాబాద్ జిల్లా భీంగల్‎లో ఫుడ్ పాయిజన్ కలకలం

నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.భీంగల్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది.

దీంతో సుమారు వంద మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం నిజామాబాద్, భీంగల్ ఆస్పత్రులకు తరలించారు.

కాగా విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న అధికారులు ఫుడ్ శాంపిల్స్ ను సేకరించారు.

అనంతరం ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Advertisement
అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)

తాజా వార్తలు