ఆరెంజ్ వలన అద్భుత లాభాలు

వేల సంవత్సరాలుగా మానవాళికి అందుబాటులో ఉన్న ఫలం ఆరెంజ్.సిట్రస్ కుటుంబానికి చెందిన ఈ ఫలాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా పండిస్తారు.

మార్కెట్ వెళితే చాలా కామన్ దొరుకుతుంది కాని, మీరు అరెంజ్ తిని ఎన్నిరోజులైందో ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.చాలారోజులైతే ఆరెంజ్ లాభాలు కొన్ని తెలిసుకున్నాక మీరే రెగ్యులర్ గా తినటం మొదలుపెడతారేమో! * అరెంజ్ లో విటమిన్ సి చాలా ఎక్కువగా దొరుకుతుంది.ఎంత అంటే ప్రతి 100 గ్రాములకి 53.20 మిల్లిగ్రాముల విటమిన్ సి అందిస్తుంది ఆరెంజ్.ఈ విటమిన్ సి రోజుకి 90 మిల్లిగ్రాములు మగవారి శరీరంలో, 75 మిల్లిగ్రాములు ఆడవారి శరీరంలో పడాలి.

Few Healthy Benefits Of Orange-Few Healthy Benefits Of Orange-Telugu Health-Telu

అదే గర్భం దాల్చిన మహిళకైతే రోజుకి 85 మిల్లిగ్రాములు, పాలుపట్టే మహిళలకి 120 మిల్లిగ్రాములు అవసరం.* అరెంజ్ లో విటమిన్ సి తోపాటు ఫైబర్, ఫొలేట్, విటమిన్ బి1, పాంటోధెనిక్ ఆసిడ్, కాపర్, కాల్షియం, పొటాషియం లభిస్తాయి.

* ఆరెంజ్ లో సిట్రస్ లిమొనైడ్స్ బాగా ఉంటాయి ఇవి రకరకాల క్యాన్సర్స్ తో పోరాడగలవు.* ఆరెంజ్ జ్యూస్ ని రెగ్యులర్ గా (అతిగా కాదు) తాగితే కిడ్నిల్లో రాళ్ళు రాకుండా అడ్డుకోవచ్చు.

Advertisement

* దీనిలో ఫైబర్ బాగా ఉండటం వలన ఇది బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ కి చెక్ పెడుతుంది.* ఆరెంజ్ ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడుతుంది.వీలైనంత వరకు క్యాన్సర్‌, గుండెజబ్బులను అడ్డుకుంటుంది.

* ఆరెంజ్ లో పోలిఫెనల్స్ ఎక్కువగా ఉండటంతో, ఇది కొన్నిరకాల వైరల్ ఇంఫెక్షన్స్ ని అడ్డుకోగలదు.* దీనిలో బెటాకరోటీన్ కూడా బాగానే ఉండటంతో, ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది.

అందుకే చాలారకాల బ్యూటి ప్రాడక్ట్స్ లో ఆరెంజ్ ని వాడుతారు.

ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఇది తీసుకోవడం మాత్రం మరవకండి!
Advertisement

తాజా వార్తలు