ఫాస్టాగ్ వాడితే వాహనాలకు ఎన్ని లాభాలో తెలుసా...?

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఏర్పాటు చేసి టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగిందని కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది.

ఫాస్టాగ్ అమలులో వస్తే రద్దీని నియంత్రించవచ్చని కేంద్రం భావించి ఈ విధానాన్ని ఎప్పుడో అమలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఎన్ హెచ్ఏఐ (నేషనల్ హైవే ఇండియన్ అథారిటీ) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని నిలపడంతో రద్దీ పెరుగుతుందని ఈ స్కీం తీసుకొచ్చారు.

ఫాస్టాగ్ స్టిక్కర్ ను వాహనంపై ఉంచితే టోల్ ప్లాజా దగ్గర రీడర్ సాయంతో ఆటోమెటిగా స్కాన్ చేసుకుంటుంది.దీంతో టోల్ ప్లాజాకు పే చేయాల్సిన డబ్బులను ఫోన్ సాయంతో చెల్లించవచ్చు.

ఫాస్టాగ్ విధానం ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.వినియోగదారులు పొందే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Advertisement

టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లించాల్సిన పని ఉండదు.ఫాస్టాగ్ విధానంతో డబ్బులను ఆన్ లైన్ లో చెల్లించవచ్చు.ఫాస్టాగ్ విధానంతో సమయంతో పాటు ఇంధనం సేవ్ చేసుకోవచ్చు.

టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు స్టిక్కర్ సాయంతో సిబ్బంది స్కానర్ ను రీడ్ చేయడంతో డబ్బులు పే చేసి వెళ్లిపోవచ్చు.ఫాస్టాగ్ వినియోగదారులు సులభంగా డబ్బులు చెల్లించవచ్చు.దీంతో పాటు సులభంగా రీచార్జ్ చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెఫ్ట్, ఆర్టీజీఎస్, నెట్ బ్యాంకింగ్ సాయంతో డబ్బులు చెల్లించవచ్చు.ఖాతాలో తక్కువ డబ్బులున్నా, రీచార్జ్ చేసినా, టోల్ ఛార్జీలు చెల్లించినా ఎస్ఎంఎస్ రూంలో మెసేజ్ వస్తుంది.

వినియోగదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్ ను సులభంగా మ్యానెజ్ చేయవచ్చు.ఆన్ లైన్ పోర్టల్ ను కూడా ఏర్పాటు చేశారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఒక్కసారి ఫాస్టాగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు