రాజీనామా చేశానంటూ తప్పుడు ప్రచారం..: వెల్లంపల్లి

సీటు మార్పు అంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి వెల్లంపల్లి స్పందించారు.

ఈ మేరకు తన సీటు మార్పుపై ఇప్పటివరకు పార్టీ అధిష్టానం తనతో ప్రస్తావించలేదని తెలిపారు.

ఈ క్రమంలోనే తాను విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని వెల్లంపల్లి పేర్కొన్నారు.విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారనేది అవాస్తవమని తెలిపారు.

అలాగే తాను పార్టీకి రాజీనామా చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.సీఎం జగన్ ను నమ్ముకున్న వ్యక్తినన్న వెల్లంపల్లి జగన్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

విజయవాడలోని మూడు నియోజకవర్గాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించి జగన్ కు ఇస్తామని వెల్లడించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు