బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన కియారా అద్వానీ.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రేమ పక్షులు అయిన కియారా అద్వానీ, సిద్దార్థ్‌ మల్హోత్రాల బ్రేకప్ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇదే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట, క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న ఈ జంట విడిపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు విన్న అభిమానులు షాక్ కు గురవుతున్నారు.అయితే ఈ జంట ఎప్పుడెప్పుడు వివాహ బంధంతో ఒకటవుతారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వివాహ బంధంతో ఒకటవుతారు అనుకున్న ఈ జంట విషయంలో బ్రేకప్ అన్నమాట రావటంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్నప్పటికీ ఈ వార్తల్లో నిజా నిజాలపై ఇంకా స్పష్టత లేదు.

Advertisement
Fact Check Siddharth Malhotra Kirara Advani Broken Details, Sidharth Malhotra,

సోషల్ మీడియాలో కియారా అద్వానీ, సిద్దార్థ్‌ మల్హోత్రాలు బ్రేకప్ అన్న వార్తలు వినిపిస్తున్నా కూడా ఆ జంట స్పందించకపోవడంతో అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు.ఇదే విషయంపై అభిమానులకు ఊరట కలిగిస్తూ ఈ జంట విడిపోవడం లేదని అవన్నీ కూడా జస్ట్ రూమర్స్ మాత్రమే అంటూ వర్గాలు తెలిపాయి.

Fact Check Siddharth Malhotra Kirara Advani Broken Details, Sidharth Malhotra,

ఈ జంట ప్రస్తుతం కలిసి లేరు అన్న వార్త నిజమే కానీ అది గొడవల వల్ల కాదని, షూటింగ్ ల కారణంగా ఇద్దరూ బిజీగా ఉండటంతో విడివిడిగా ఉంటున్నారు అని వారు స్పష్టంచేశారు.ఇక ప్రస్తుతం సిద్ధార్థ్‌ షూటింగ్‌లో భాగంగా టర్కిలో ఉండగా.కియారా తన తాజా చిత్రం భూల్ భులయ్యా-2 సినీమా ప్రమోషనన్స్ లో భాగంగా బిజీగా ఉందట.

ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే సిద్దార్థ్ టర్కీ నుంచి బాగానే ఆ వార్తలో నిజానిజాలు ఏంటో అనేది మీకు తెలుస్తుంది అనీ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.

Fact Check Siddharth Malhotra Kirara Advani Broken Details, Sidharth Malhotra,

కాగా వీరిద్దరు తొలిసారి జంటగా నటించిన షేర్షా సినిమా సమయంలో కియారా, సిద్ధార్థ్‌లు ప్రేమలో పడ్డారు.ఇక అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్‌ అంటూ తెగ చక్కర్లు కొట్టారు.అంతే కాకుండా బాలీవుడ్ లో ఆలియా,రణ్‌బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్‌ వీళ్లేనంటూ బాలీవుడ్ సినీ వర్గాల్లో ఇటీవల జోరుగా ప్రచారాలు కూడా జరిగాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

కానీ అందరికి షాక్‌ ఇస్తూ కియారా, సిద్దార్థ్‌లు విడిపోయినట్లు ఒక్కసారిగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

Advertisement

తాజా వార్తలు