CM Revanth Reddy : తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు..: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.

పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

రాజకీయాలు ఎలా ఉన్న వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు.అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని తేల్చి చెప్పారు.

Cm Revanth Reddy : తెలంగాణలో డ్రైపోర్ట్ �

ఈ క్రమంలోనే గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని తెలిపారు.విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.రూ.2 వేల కోట్లతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా డెవలప్ చేస్తామని తెలిపారు.అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారన్న సీఎం రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ( Outer Ring Road )కు లైఫ్ లైన్ గా మారిందని తెలిపారు.

Advertisement
CM Revanth Reddy : తెలంగాణలో డ్రైపోర్ట్ �
జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 

తాజా వార్తలు