గున్న ఏనుగు ప్రాణాలను కాపాడిన సిబ్బంది.. చూస్తే వావ్ అనాల్సిందే!

గున్న ఏనుగులు భలే ముద్దుగా ఉంటాయి.అవి చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి.

బుచ్చి బుచ్చి కాళ్లతో అలా అలా గెంతుతుంటే సరదాగా ఉంటుంది.చిన్న తొండంతో అవి ఆడే ఆటలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంద.

కానీ ఆ గున్న ఏనుగులు బాధతో విలవిల్లాడిపోతుంటే.చూసి తట్టుకోలేము.

నొప్పితో ఏడుస్తుంటే.మన గుండె స్రవిస్తుంది.

Advertisement

థాయ్ లాండ్ లో జరిగిన ఓ ఘటన నెటిజన్లను మెలిపెడుతోంది.అయితే ఆ గున్న ఏనుగును కాపాడిన సిబ్బందిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

అసలేం జరిగిందంటే.థాయ్ లాండ్ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్కు అది.ఆ పార్కులో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడి పోయింది.దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు ఎన్నో ప్రయత్నాలు చేసింది.

శాయశక్తులా ప్రయత్నించింది.పిల్ల ఏనుగులు బయటకు తీసుకురావాలన్న తపనతో చాలా పాట్లే పడింది.

కానీ వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు.ఈ క్రమంలోనే దాన్ని కాపాడేందుకు జంతు సంరక్షకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

ఇది గమనించి తల్లి ఏనుగు.మరింత ఆందోళనకు గురైంది.రెస్క్యూ ఆపరేషన్ ను అడ్డగించింది.

Advertisement

దీంతో సిబ్బంది.ట్రాంక్విలైజర్ లు ఉపయోగించారు.

దీంతో తల్లి ఏనుగు స్పృహ కోల్పోయింది.గుంత పక్కనే పడిపోయింది.

తల్లి ఏనుగు కూడా కాస్త గుంతలోకి జారింది.దానికి తాళ్లు కట్టి.

క్రేన్ సాయంతో బయటకు లాగారు.ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఏనుగుపైకి కొంత మంది ఎక్కి సీపీఆర్- కార్డియోపల్మనరీ రెసస్కిటేషన్ చికిత్స చేశారు.

అప్పటికే పిల్ల ఏనుగు బయటకు వచ్చేందుకు వీలుగా గుంతను తవ్వారు.చివరకు అది బయటకు వచ్చింది.

మరో వైపు తల్లి ఏనుగు కూడా స్పృహ లోకి వచ్చింది.తర్వాత అవి రెండూ కలిసి అడవిలోకి వెళ్లి పోయాయి.

తాజా వార్తలు