రేవంత్ రెడ్డి పై దాడికి నిరసనగా కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

గంభీరావుపేట : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బిఆర్ఎస్ లీడర్ల వ్యవహారం ఉందని గంభరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ అన్నారు.

అధికార పార్టీ లీడర్ల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయనీ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర పై టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్నటి దాడికి నిరసనగా గంభీరావుపేట మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ….ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణ రాష్ట్రంలోని ఏ పేద, మధ్యతరగతి కుటుంబాలకు లాభం జరగలేదని కుటుంబ పాలన కొనసాగిస్తూ మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.ఇలా దోపిడికి గురవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ఊరు ఊరును వాడ వాడను కలుపుకుంటూ ప్రజలలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి పై కక్షపూరితంగా అదే విధంగా రేవంత్ రెడ్డి కి ప్రజలలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని సంకేతాలు వచ్చిన సందర్భాన్ని చూసి ఓర్వలేక కావాలని అక్కసుతో రేవంత్ రెడ్డి పై దాడి చేయడం జరిగిందని అన్నారు.

దీని వెనకాల మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఈ సందర్భంగా హమీద్ ఆరోపించారు.బహుశా కేటీఆర్ మరిచిపోయారేమో తనకు 2009 ఎన్నికల సందర్భంగా గంభీరావుపేట మండలంలో కోడిగుడ్లు, టమాటాలతో స్వాగతం పలకడం జరిగిందని మరొకసారి చరిత్ర పునరావృతం అవుతుందని కేటీఆర్ గంభీరావుపేట మండలానికి ఎప్పుడు పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కచ్చితంగా అడ్డుకొని కోడిగుడ్లు, టమాటాలతో గట్టి సమాధానం చెబుతారని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్, గంభీరావుపేట పట్టణ శాఖ అధ్యక్షుడు పాపా గారి రాజు గౌడ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగి స్వామి, కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏడ పోయిన ప్రభాకర్,నాగయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

Latest Rajanna Sircilla News