దళితబంధు పెండింగ్ యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళితబంధు పెండింగ్ యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి దేశించారు.బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఫామ్ ఆయిల్ పంట సాగు, దళిత బంధు, స్వచ్ఛ సర్వేక్షణ్, పిఎంఎఫ్ఎంఈ స్కీం పురోగతిని పై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 Grounding Of Dalit Bandhu Pending Units Should Be Completed..district Collector-TeluguStop.com

దళిత బంధు యూనిట్లకు సంబంధించి యూసీ లను సబ్మిట్ చేసి యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు సూచించారు.గ్రౌండింగ్ అయిన యూనిట్ల వివరాలను ప్రత్యేకించిన మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలన్నారు.

పాడి గేదెల డైరీ యూనిట్ లకు సంబంధించి లబ్దిదారుల నుండి కన్సెంట్ తీసుకుని యూనిట్ ల గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.రైతులను చైతన్యం చేసి జిల్లాలో నిర్దేశించి న లక్ష్యం మించి ఆయిల్ పామ్ పంట సాగు అయ్యేలా చూడాలన్నారు.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం ( పిఎంఎఫ్ఎంఈ స్కీం) యూనిట్ ల గ్రౌండింగ్ పురోగతిపై సమీక్షించారు.ఈ పథకంలో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీపీఓ రవీందర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ రావు, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లిఖార్జున్, ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube