తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ కేసుపై ఈడీ విచారణ

తెలంగాణలోని ఈఎస్ఐ స్కామ్ కేసుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, నాగలక్ష్మీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

హైదరాబాద్ ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా మనీలాండరింగ్ ద్వారా నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

ఈఎస్ఐలో వందల కోట్లు నిధులు దుర్వినియోగం అయినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.దాంతో పాటు అనర్హులకు టెండర్లను కట్టబెట్టినట్లు ఆరోపిస్తుంది.

కాగా తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణంపై 2019వ సంవత్సరంలో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 

తాజా వార్తలు