ఈ భూప్రపంచంలో ఆమె కన్నా అందగత్తె మరొకరు లేరు .. నా సర్వస్వం ఆమెనే

దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) ఇతడి గురించి సీతారామన్ సినిమా తర్వాత ఎవరిని అడిగినా ఇంత గొప్ప నటుడు, అందగాడు మరొకరు ఉండరు అని పొగుడుతూనే ఉంటారు.

మలయాళం మమ్ముట్టి కి కొడుకు అయినా సరే మమ్ముట్టి వారసత్వాన్ని అందుకున్నా సరే ఎక్కడా కూడా తండ్రి పేరు చెప్పకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.

నిజానికి దుబాయిలో జాబ్ చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్న దుల్కర్ కి చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనీ కోరిక ఉన్న ఎందుకు ఆయన తండ్రికి దుల్కర్ సల్మాన్ హీరో అవడం ఇష్టం లేదు.దుల్కర్ కి సినిమా వాతావరణం నుంచి మొదటి నుంచి దూరంగానే ఉండాలని సూచిస్తూ వస్తున్నాడు మమ్ముట్టి( Mammootty).

కానీ ఆ రక్తంలోనే నటన ఉంది నటుడు కొడుకు నటుడు అవ్వక మరేమవుతాడు.

చివరికి కొడుకు పెళ్లి చేసుకుంటే ఆయన మారుతాడని మమ్ముట్టి అనుకున్నాడు.అందుకే 2011లో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి రాకముందే అమల్ అనే ఒక నార్త్ ఇండియన్ ముస్లిం కుటుంబం అమ్మాయిని పెద్దలు కుదుర్చగా వివాహం కూడా చేసుకున్నాడు.అందగాడికి మరొక అందగత్తె తోడుగా దొరికింది.

Advertisement

ఇక వీరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే తన జీవితంలో అమల్ స్థానం ఎంతో గొప్పదని ఆమె నా జీవితంలోకి వచ్చాకే నా సినిమా కెరియర్ కూడా మొదలైంది అని ఆమె నా అదృష్ట దేవత అని చెబుతున్నాడు దుల్కర్.

ఆమె ప్రోత్సాహంతోనే సెకండ్ షో అనే సినిమా( Second Show )తో తన కెరీర్ స్టార్ట్ చేశాడు దుల్కర్ సల్మాన్.ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అమలు లేకపోతే నా జీవితంలో ఏది సరిగా జరిగేది కాదు అంటూ కూడా చెబుతున్నారు.తానే నా అదృష్ట దేవత ఆమె లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేను.

ఆమెతో నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నాను.ఆమెను కాకుండా మరొక అమ్మాయిని నా జీవితంలో ఊహించుకోలేను అంటూ ఒక స్టేజ్ పై దుల్కర్ తన భార్య మీద ఉన్న ప్రేమను బయటపెట్టారు.

ఈ జంటకు 2011లో వివాహం జరగక 2017లో ఒక కూతురు పుట్టింది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు