ఆదిలాబాద్ లో భూ తగాదాల కారణంగా బాబాయి చేతిలో యువకుడి దారుణ హత్య..!

కుటుంబంలో భూ తగాదాల కారణంగా సొంత అన్న కుమారుడిని హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని( Adilabad ) ఇచ్చోడ మండలం సాథ్ నంబర్ గ్రామంలో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.సాథ్ నంబర్ గ్రామంలో పాండురంగ్, వానోలే కేదోబ ( Pandurang, Wanole Kedoba )అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు.

పాండురంగ్ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తూ రెండు నెలల కిందట గుండెపోటు రావడంతో ఫిట్ నెస్ లేక డ్యూటీ కి వెళ్లడం లేదు.

కేదోబ ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా పనిచేసి నాలుగేళ్ల కిందట పదవీ విరమణ పొందాడు.ఈ అన్నదమ్ములకు వారి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది.ఆ భూమి సాథ్ నంబర్ గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉంది.

Advertisement

తల్లి పేరు పై ఉండే ఈ భూమిని పాండురంగ్ కు తెలియకుండా కేదోబ కుమారుడైన ఈశ్వర్( Ishwar ) (29) తన తండ్రి కేదోబ పేరిట ఒక ఎకరం భూమి, కేదోబ చెల్లెలి పేరిట ఒక ఎకరం భూమి, ఈశ్వర్ తన పేరిట ఒక ఎకరం భూమిని విరాసత్ ద్వారా పట్టాలు చేసుకున్నాడు.

వారసత్వంగా వచ్చే భూమిలో పాండు రంగ్ కు వాటా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ భూ వివాదం కోర్టులో నడుస్తోంది.ఈ భూ వివాదంపై చాలాసార్లు కుల పెద్దల వద్ద పంచాయతీ కూడా జరిగింది.ఇలా ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుంటే మరొకవైపు నెల రోజుల క్రితం ఈశ్వర్ తన తండ్రి కేదోబ పేర్ల మీద ఉన్న భూమిని కోటి రూపాయలకు విక్రయించినట్లు ప్రచారం జరగడంతో మంగళవారం ఉదయం పాండురంగ్ తన కుమారుడు సూర్యకాంతితో కలిసి ఇచ్చోడలోని సిరిచెల్మ చౌరస్తాలో ఈశ్వర్ కోసం కాపు కాశాడు.

కాసేపటి తర్వాత ఈశ్వర్ అటువైపుగా వెళ్లడంతో ఈ తండ్రి కొడుకులు ఒక్కసారిగా దాడి చేశారు.వారి నుంచి తప్పించుకుని ఈశ్వర్ పరుగులు తీయగా వెంబడించి ఈశ్వర్ ను కత్తితో పొడిచి హత్య చేశారు.

హత్య అనంతరం ఈ తండ్రి కొడుకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయారు మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో: స్లో బైక్ రేస్‌లో యువతికి, యువకుడికి టఫ్ ఫైట్.. చివరికి ఎవరు గెలిచారంటే..?
Advertisement

తాజా వార్తలు