మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. గర్భిణిగా ఉన్న కూతురిని దారుణంగా.. ?

మద్యం మత్తు మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది అనడంలో సందేహం లేదు.ఎందుకంటే దారుణం అయిన ఘోరాలు ఎన్నో మద్యం మత్తులో చేసినవిగా నిర్ధారించబడినవి.

ఇకపోతే కంటికి రెప్పలా కాపాడవలసిన ఓ తండ్రే కన్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండా హతమార్చిన ఘటన బుధవారం కర్ణాటకలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

Drunken Father Murdered Pregnant Daughter In Karnataka , Karnataka, Anchetti, Ka

అంచెట్టి సమీపంలోని కరడికల్‌ గ్రామానికి చెందిన అరుణాచలం కూతురు వెంకటలక్ష్మి (20)కి కోలారు జిల్లా మాలూరు ప్రాంతానికి చెందిన వ్యక్తితో 4 నెలల క్రితం వివాహం జరిగింది.ఈ క్రమంలో గర్భవతి అయిన లక్ష్మి ఉగాది పండుగను పురస్కరించుకుని తన పుట్టింటికి వచ్చింది.

పండగ తర్వాత చిత్తుగా మద్యం తాగిన ఈ యువతి తండ్రి తన భార్యతో గొడవకు దిగి ఆవేశంలో ఆమెను కాల్చబోయాడు.ఈ సమయంలో అక్కడే ఉన్న కూతురు వెంకటలక్ష్మి తండ్రిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ తుపాకీ పేలి ఆమెకు గాయలవగా ఘటన స్దలంలోనే మృతి చెందింది.

Advertisement

కాగా ఆ తాగుబోతు తండ్రి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.ఇక స్దానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అరుణాచలం కోసం గాలిస్తున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు