మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్ధాలు: ట్రాఫిక్ ఏసీపీ

మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్ధాలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ స్పష్టం చేశారు.పోలీస్ కమిషనర్ విష్ణు యస్.

వారియర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కమాండ్ కంట్రోల్ లోని ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్లో శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు.మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేశారు.

Driving Under The Influence Of Alcohol Is Illegal Traffic ACP , Traffic ACP, AC

ఏసీపీ మాట్లాడుతూ .మద్యం మత్తు కుటుంబాన్ని చిత్తు చేస్తుందని, మత్తులో నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపుతూ.రోడ్డు పక్కన ఉన్న డివైడర్లను ఎక్కించడం,.

బారికేడ్లుగా ఏర్పాటు చేసిన సిమెంట్‌ దిమ్మెలను, విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడం.ఎదురుగా వస్తున్న వాహనాలు డీ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారని అన్నారు.

Advertisement

తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా పణంగా పెడుతున్నారని, ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్లే జరుగుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో వెల్లడైందన్నారు.మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలొస్తాయని అన్నారు.

కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుందని,జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు.విద్యార్థులు, యువకులకు ఉద్యోగావకాశాలప్పుడు ఈ కేసులు ప్రతిబంధకాలవుతాయని గుర్తించాలన్నారు.

విదేశాలకు వెళ్లేందుకు వీలుండదని.నగర పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డుతున్నారని తెలిపారు.

కార్యక్రమంలో సిఐలు అంజలి, ఆశోక్ కుమార్ పాల్గొన్నారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు