అమెరికా అధ్యక్ష ఎన్నికలు : దూసుకెళ్తున్న కమలా హారిస్.. యువతను టార్గెట్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధిగా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) ఉన్నంత వరకు రిపబ్లికన్ నేత , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) ఎదురులేకుండా పోయింది.

బైడెన్ వయసు, వృద్ధాప్యం, తడబాటు కారణంగా ముందస్తు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లో ట్రంప్ దూసుకెళ్లారు.

కానీ ఎప్పుడైతే బైడెన్ తప్పుకుని రేసులోకి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వచ్చారో నాటి నుంచి రాజకీయాలు మారిపోయాయి.డెమొక్రాట్ నేతలు, భారతీయ కమ్యూనిటీ ఆమెకు అండగా నిలుస్తున్నారు.

నల్లజాతికి చెందిన నేత కావడంతో ఆ వర్గం కూడా కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతోంది.ఈ నేపథ్యంలో ట్రంప్ శిబిరం అలర్ట్ అయ్యింది.

కమలా హారిస్‌, డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి టిమ్ వాల్జ్‌ను( Candidate Tim Walz ) టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది.అలాగే ఎన్నికల్లో తనకు మద్ధతిచ్చే యువకుల ఓట్లను ఎలా పొందాలనే దానిపై ఫోకస్ చేసింది.

Advertisement
Donald Trump Campaign Targeting Younger Male Voters To Edge Out Kamala Harris In

డెమొక్రాట్ల పాలనలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, దేశ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఈ పరిస్దితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.

Donald Trump Campaign Targeting Younger Male Voters To Edge Out Kamala Harris In

మరోవైపు అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ డెమొక్రాట్ శిబిరానికి ఊపుతెచ్చారని.నిధుల సేకరణ విషయంలో ఆమె బృందం ముందుందని వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో ట్రంప్ ప్రచార బృందం, దాని అనుబంధ సంస్థలు ఈ ఏడాది జూలైలో 138.7 మిలియన్ డాలర్లు( 138.7 million dollars ) సేకరించినట్లుగా తెలుస్తోంది.ఇది కమలా హారిస్ నివేదించిన (310 మిలియన్ డాలర్లు) దాని కంటే తక్కువని అమెరికన్ మీడియా చెబుతోంది.

Donald Trump Campaign Targeting Younger Male Voters To Edge Out Kamala Harris In

ఇదిలాఉండగా.కమలా హారిస్- డొనాల్డ్ ట్రంప్‌లు మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ ఖరారైంది.తాను చెప్పిన షరతులకు అంగీకరిస్తే కమలతో చర్చలో పాల్గొంటానని ట్రంప్ పేర్కొన్నారు.

దీనికి కమలా హారిస్ కూడా అంగీకారం తెలిపారని.ట్రంప్ - కమలా హారిస్ మధ్య వచ్చే నెల 10న డిబేట్ జరుగుతుందని ఏబీసీ ఛానెల్ ధ్రువీకరించింది.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు