ముఖాముఖి చర్చ రెడీ.. కమలా హారిస్ సవాల్, డొనాల్డ్ ట్రంప్ ఆన్సర్ ఇదే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు( Kamala Harris ) ఊహించని మద్దతు లభిస్తోంది.

పలు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లో ట్రంప్‌తో( Trump ) పోలిస్తే కమల పై చేయి సాధించారు.

హారిస్ రాకతో డెమొక్రాట్ల విజయావకాశాలు సైతం మెరుగవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం సంబరాలు చేసుకుంటున్నాయి.తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ ముందు బైడెన్( Biden ) తేలిపోగా.

ఆయనతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమంటూ కమలా హారిస్ సవాల్ విసురుతున్నారు.ఇండియానాపోలిస్‌లోని( Indianapolis ) చారిత్రక జెటా ఫి బీటా ఆఫ్రో అమెరికన్ సొసైటీలో ఆమె ప్రసంగిస్తూ.16 ఏళ్లుగా ఈ రాష్ట్రం డెమొక్రాట్లకు పెద్ధగా మద్ధతు ఇవ్వడం లేదన్నారు.ఒక మహిళ తన శరీరంపై తానే నిర్ణయం తీసుకోవాలి గానీ ప్రభుత్వం చెప్పడం ఏంటని కమలా హారిస్ ప్రశ్నించారు.

నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ఆమె అభ్యర్ధించారు.

Donald Trump Asks Kamala Harris To Wait Until Democratic Convention For Debate D
Advertisement
Donald Trump Asks Kamala Harris To Wait Until Democratic Convention For Debate D

అయితే ట్రంప్ మాత్రం డెమొక్రాట్ల నుంచి అధ్యక్ష అభ్యర్ధి ఎవరో తేలేవరకు వెయిట్ చేస్తానని తేల్చిచెప్పారు.అలాగే అమెరికాను పాలించేందుకు కమలా హారిస్‌కు అర్హత లేదని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నార్త్ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.

ఆమె తీవ్రమైన వామపక్ష ఉన్మాది అని.బైడెన్ వైఫల్యాల వెనుక కమల ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఆమెకు కనుక అధికారం అప్పగిస్తే దేశాన్ని సర్వనాశనం చేస్తారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Donald Trump Asks Kamala Harris To Wait Until Democratic Convention For Debate D

ఇదిలాఉండగా డెమొక్రాట్ పార్టీ( Democratic Party ) తరపున అభ్యర్ధి ఎంపిక ప్రక్రియను వచ్చే నెల 1వ తేదీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి.ఆగస్ట్ 7 నాటికి పూర్తి చేయనున్నారు.అనంతరం చికాగో వేదికగా ఆగస్ట్ 19 నుంచి 22 వరకు జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో అధ్యక్ష అభ్యర్ధికి ఆమోదం తెలుపుతారు.

మరి కమలా హారిస్ పేరునే లాంఛనంగా ప్రకటిస్తారా లేక డెమొక్రాట్లు మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు