ప్రతి ఒక్కరి సక్సెస్ స్టోరీ( Success Story ) ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందనే సంగతి తెలిసిందే.సీఏ పరీక్షలో( CA Exam ) పాస్ కావడం సులువైన విషయం కాదు.
ఈ పరీక్షలో పాస్ కావడం కోసం చాలామంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు.పిల్లల సక్సెస్ తల్లీదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
మహారాష్ట్ర రాష్ట్రంలోని( Maharashtra ) లోథానేలోని డోంబివిలిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
థోబ్రే మావ్షి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఆమె కొడుకు యోగేష్( Yogesh ) సీఏ పరీక్షలో పాస్ అయ్యారు.
ఈ గుడ్ న్యూస్ ను యోగేశ్ తల్లితో పంచుకున్న వెంటనే ఆమె కొడుకును కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.బ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ మంత్రి రవీంద్ర చౌహాన్ ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకోవడం గమనార్హం.

యోగేశ్ మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను.బలం, దృఢ సంకల్పంతో యోగేష్ ఎంతో కష్టపడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు అంటూ ఆయనను మంత్రి అభినందించారు.యోగేశ్ సక్సెస్ స్టోరీని నెటిజన్లు అభినందిస్తున్నారు.యోగేశ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.యోగేశ్ టాలెంట్ ను నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

యోగేశ్ మరింత కష్టపడితే మరెన్నో విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.యోగేశ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా సాధించే విజయాలతో ఎంతోమంది అభినందనలు సైతం పొందాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యోగేశ్ బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవారని తెలుస్తోంది.
తల్లి పడే కష్టాన్ని చూసి యోగేశ్ ఎంతో కష్టపడి చదువుకున్నారని సమాచారం అందుతోంది.యోగేశ్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని తెలుస్తోంది.
యోగేశ్ సక్సెస్ చూసి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.