ట్రంప్ పాలసీ హెడ్‌గా వలసదారుల వ్యతిరేకి.. హెచ్1 బీ వీసాదారులకు గడ్డుకాలమేనా?

హోరాహోరీ పోరులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తను పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి తన జట్టును రెడీ చేసుకుంటున్నారు.

సమర్ధులు, ప్రతిభావంతులకు కీలకపాత్రలు అప్పగిస్తున్నారు.

అయితే వలసదారులు మాత్రం ట్రంప్ రాకతో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీగా స్టీఫెన్ మిల్లర్‌ను (Stephen Miller as Deputy Chief of Staff for Policy)నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పరిణామాలు తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా తాను అనుసరించిన కఠినమైన ఇమ్మిగ్రేషన్(Immigration) వైఖరి మరోసారి ఆచరిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన సలహాదారు అయిన మిల్లర్ .ముస్లిం ప్రయాణికులపై నిషేధం, కుటుంబ విభజన విధానంతో సహా అత్యంత వివాదాస్పద విధానాలను రూపొందించడంలో ట్రంప్(Trump) మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కీలకపాత్ర పోషించారు.మిల్లర్ నియామకానికి కాంగ్రెస్ ఆమోదముద్ర లభిస్తే.

Advertisement

హెచ్ 1 బీ(H1B Visa) వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ట్రంప్ అధికారికంగా మిల్లర్ నియామకాన్ని ప్రకటించలేదు.

అయితే సోషల్ మీడియాలో ఆయన నియామకం ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే.టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk), భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామిలకు ట్రంప్ (Trump ,Vivek Ramaswamy)కీలక బాధ్యతలు అప్పగించారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ హెడ్స్‌గా ఈ ఇద్దరు కుబేరులను నియమించారు.

జో బైడెన్ సారథ్యంలోని ప్రభుత్వం వృథా ఖర్చులను చేస్తోందని.ప్రభుత్వ వ్యవస్థల్లో సంస్కరణలే లక్ష్యంగా ఈ డిపార్ట్‌మెంట్‌ను రూపొందించామని అధికారులు తెలిపారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
బ్రిటన్‌లో పీజీ .. భారతీయ విద్యార్ధులకు యూకే వర్సిటీ అరుదైన అవకాశం

వివేక్, ఎలాన్ మస్క్‌లు(Vivek ,Elon Musk) దుబారా ఖర్చులను తగ్గించడంలో ప్రభుత్వానికి సాయం చేస్తారని ట్రంప్ సైతం ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో ఈ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు