తల్లికి తినిపిస్తూ తమాషా చేసిన కొడుకు.. పెంపుడు కుక్క సరదా తీర్చేసింది!

మన మనుషుల కంటే పెంపుడు జంతువులకు విశ్వాసం ఎక్కువ అని అవి ఇప్పటికే చాలా సార్లు నిరూపించాయి.

ముఖ్యంగా శునకాలు అయితే విశ్వాసానికి మారు పేరు అని చెబుతుంటారు.

ఇప్పటికే శునకం తన యజమాని పట్ల చూపే ప్రేమ, విశ్వాసం అనేక సార్లు వార్తల్లో వినే ఉంటాం.పలు వీడియోల్లో చూసే ఉంటాం.

ఇలా పెంపుడు కుక్క చేసే పనులు ఫన్నీ వీడియోల రూపంలో నెటిజెన్స్ ను ఆకట్టు కుంటూనే ఉన్నాయి.తాజాగా మరొక సారి పెంపుడు కుక్క తన యజమాని పట్ల చూపించిన ప్రేమకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో ప్రసెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ఫన్నీ వీడియోను నెటిజెన్స్ ఇష్ట పడుతున్నారు.

Advertisement

ఈ వీడియోలో ఒక వ్యక్తి తన తల్లికి తినిపిస్తూ చేసిన చిలిపి పనికి పెంపుడు కుక్క ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.అంత పని ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారా.

వైరల్ అవుతున్న ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దీ సమయంలోనే వైరల్ అయ్యింది.ఈ వీడియోలో పెంపుడు కుక్క తన యజమానిపై ప్రేమను చూపించింది.

అంత విశ్వాసాన్ని చూపించిన కుక్కను అందరు మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియోలో ఒక కొడుకు తన తల్లికి ఫ్రూట్స్ కట్ చేసి బౌల్ లో వేసి తినిపిస్తూ ఉన్నాడు.అప్పుడు అతడు తినిపిస్తూ తినిపిస్తూ ఒకేసారి ఒక చిలిపి ఆలోచన వచ్చి ఒక తుంటరి పని చేసాడు.ఫోర్క్ తో తినిపిస్తున్న అతడు ఆమెకు పెట్టకుండా కుక్కకు తినమని చూపించాడు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

అప్పుడు ఆ కుక్క తన యజమానికి పెట్టమని తన కాలితో చూపించింది.అతడు కూడా పెట్టడానికి ముందుకు తీసుకువెళ్లి ఒక్కసారే ఆగిపోయి ఆ ముక్కను అతడే తినేసాడు.

Advertisement

అది చూసిన కుక్క అతడిని కాళ్ళతో కొట్టింది.తన యజమానికి తినిపించకుండా అతడు తిన్నాడని కోపంతో అతడిని కొట్టడం నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది.

ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

తాజా వార్తలు