అమెరికా అధ్యక్షులు వారికి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లు అయింది.విశ్వమంతా పాక్ ఉగ్రదేశమని నినందిస్తుండగా అమెరికా పెడచెవిన పెట్టింది.
పాక్ పట్ల మిత్రవైఖరి అవలంభించింది.ఆ మిత్రత్వంతోనే అమెరికా పాక్ కు ఎఫ్ -16 యుద్ధ విమానాల మరమ్మతుకు,విడిభాగలు సరఫరా చేయడానికి సెప్టెంబరు మాసం లోనే నిర్ణయించింది.
ఎఫ్ -16 యుద్ధ విమానాల ఆధునీకరణ పట్ల అమెరికా ,పాక్ పట్ల చూపిస్తున్న ధోరణికి భారత్ నిరసన తెలియజేసింది.అయినా బైడెన్ పట్టించుకోలేదు.
ఇటీవల కశ్మీర్ లో ఉగ్రచర్యలు పెట్రేగి పోతుండటంతో అందులో పాక్ హస్తం ఉందనేది అందరికి తెలిసిందే.అది తెలిసే బైడెన్ , పాక్ ప్రపంచంలోని అతి ప్రమాదకర దేశంలో ఒకటి అని తాజాగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
అయితే బైడెన్ ఈ విధంగా ప్రకటించడం పాక్ ఊహించలేదు.అకస్మాత్తుగా బైడెన్ ఆ విధంగా పాక్ పట్ల స్పందించడంలో తన దేశం లోని అమెరికా రాయభారికి సమన్లు పంపింది.
బైడెన్ ఈ విధంగా తమ దేశాన్ని అతి ప్రమాదకారి అని ప్రకటించడం తమకు విస్మయం కలిగించిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.పాక్ ప్రమాదకర దేశమని అందరికి తెలుసు.1998 లో పాక్ తొలిసారిగా అణు ప్రయోగాలు చేయడం ప్రారంభించింది.పాక్ ఆయుధాలు ఉగ్రవాదుల చేతులలో ఉన్నాయనే నగ్న సత్యం.
ఇదే అమెరికా అనుమానించింది.ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికే అమెరికా ,పాక్ కు ఆయుధాలు సరఫరా చేసిందని,అయితే పాక్ వాటిని ఉగ్ర నిరోధక నిర్ములనకు హెచ్చించకుండా, ఉగ్రవాదాన్ని ఇంకా ఎగదోస్తున్నదని అమెరికా వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు చాలా ఆలస్యంగా జ్ఞానోదయమైంది.ఒబామా అధ్యక్షుడు గా ఉండిన కాలంలో బిన్ లాడెన్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు.
లాడెన్ పాక్ లోనే ఉన్నాడని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్న పాక్ ఖాతరు చేయలేదు.చివరకు పాక్ లోనే అతని స్వంత గృహంలో లాడెన్ ను అత్యంత సుశిక్షితులైన అమెరికా సైన్యం మట్టు పెట్టింది.
ఇదంతా ఒబామా ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం.తర్వాత అతని ఆనవాళ్లు లేకుండా చేసింది.
ఉగ్రవాద నిర్ములనలో ఇది గొప్ప విజయం.ప్రపంచంలో ఎక్కడా ఉగ్ర చర్యలు ఉండకూడదని అన్ని దేశాల అభిప్రాయంగా ఉంది.
అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పరిస్థితి వేరుగా ఉంది.అక్కడ ఎప్పుడు ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో చెప్పలేం.
ఉగ్ర చర్యలు అణచివేతకే ఎఫ్ -16 సాంకేతిక సహాయాన్ని పాక్ కు అందించామని,అయితే పాక్ ఈ సహాయాన్ని దుర్వినియోగం చేస్తోందని అమెరికా ఆరోపణ.దానికి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సరైన వివరణ ఇవ్వకుండా ఇటువంటి నిరపరాద చర్యలను పాక్ పై మోపడం సబబుకాదని,ఉగ్ర నిర్ములనకు పాక్ ఎప్పుడు ముందువుంటుందని,అందుకు కృషి చేస్తుందని తెలిపాడు.
ఈ విషయాన్ని అమెరికా ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు.అమెరికా ఆవిధంగా పాక్ ప్రమాదకారి అని చెప్పడంలో పాక్ భారత్ ను అనుమానిస్తోంది, తన అక్కసు వెళ్లబోసుకుంటోంది.దీని వెనుక భారత్ హస్తం ఉందని పాక్ అభియోగం.
అసలు భారత్ కు ఏ పాపం తెలీదు.అనవసరంగా పాక్ నోరుజారుతోందని భారత్ వాదన.
పాక్ కు అణు సహయం చేయడంలో నిరసన వ్యక్తం చేశామే కాని వద్దని చెప్పలేదు.అయినా ఒక దేశానికి సహాయ సహకారాలు అందించడం ఆ దేశ నైతికతపై ఆధారపడి ఉంటుంది.
అమెరికా ఇప్పుడు కొత్తగా పాక్ ప్రమాదకరి దేశం అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.ఉగ్రవాదులకు నిలయం ఏ దేశమో అందరికి తెలుసు.
అమెరికా నిజాన్ని గ్రహించే పాక్ ప్రమాదకరమైన దేశం అని చెప్పటం లో అర్ధం ఉంది.కనుక పాక్ పారదర్శకంగా వ్యవహరించి ముందు ఉగ్రవాదం భూస్థాపితం చేస్తే అప్పుడు అమెరికా నుంచి సహాయం పొందవచ్చు.
ఉగ్రచర్య నిరోధానికి భారత్ కూడా పాక్ కు సహాయం చేస్తుందనేది నిజం.కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయినప్పుడు అసలు పాక్ కు అక్కడ ఏం పని? అలజడి సృష్టించడం,బాంబులు పేల్చడం వంటి క్రియలకు పాల్పడుతోంది.
కాశ్మీర్ ను భారత్ నుంచి లాగేసుకుని ,భారత్ లోని కశ్మీర్ కు ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టడం,దానికి భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పడం నిజం.ఆజాద్ కశ్మీర్ అని పేరు పెట్టడమే తప్పు.బలవంతంగా ఒక దేశంలోని ప్రాంతాన్ని పాక్ ఆక్రమించుకుని ఒక పేరు పెట్టడం దేనికి సంకేతం ఇది ఉగ్ర చర్య కాదా, బలవంతపు చర్య కాదా.
కాశ్మీర్ ఎప్పుడు భారత్ లో అంతర్భాగమే.ఆజాద్ కాశ్మీర్ అనేది భారత్ అంగీకరించదు.భారత్ లోని కశ్మీర్ కు అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలి.
అంతర్జాతీయ సమాజం లో భారత్ లో కాశ్మీర్ ఎప్పుడో నిక్షిప్తమై ఉందని అందరికి తెలుసు.కాశ్మీర్ పై అర్ధం లేని,పస లేని మాటలు పంతాలతో పాక్ వాదన వినిపిస్తోందని భారత్ తీవ్రంగా నిరసించింది.
ఈ నిజాలు గ్రహించే అమెరికా పాక్ కు ఎఫ్ - 16 యుద్ధ విమానాల సహాయం చేసిందని,వాస్తవంగా ఉగ్రవాద చర్యలు ఆపాలని పాక్ ను అమెరికా కోరింది.అయితే పాక్ ఉగ్రచర్యలకు ఊతమిస్తూ తన వైఖరిని చాటుకుంది.
అందుకే బైడెన్ అత్యంత ప్రమాదకరమైన దేశం పాక్ అని చెప్పడం,నిజం తెలిసే బైడెన్ ఆ విధంగా చెప్పాడు అనేది ఒక వైపు అయితే మరోవైపు బైడెన్ కు చాలా ఆలస్యంగా జ్ఞానోదయమైంది అని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy