బంగారంతో దోచేయ్‌ ఢీ

తమిళ స్టార్‌ దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం ‘ఓకే కన్మణి’.ఈ సినిమా తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో డబ్బింగ్‌ అవుతోంది.

దిల్‌రాజు ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.తెలుగులో మణిశర్మకు మంచి మార్కెట్‌ ఉంది.

దానికి తోడు ఆయన తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రాలు తెలుగులో రికార్డు స్థాయిలో వసూళ్లు చేయడం జరిగాయి.దాంతో మణిశర్మ చాలా కాలం తర్వాత తెరకెక్కిస్తున్న ఈ లవ్‌స్టోరీ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఆ అంచనాలను బేస్‌ చేసుకుని దిల్‌రాజు ఈ సినిమాను భారీగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించాడు.ఏప్రిల్‌ 17న ఈ సినిమాను తెలుగు మరియు తమిళంలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Advertisement

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు తెలుగులో అక్కినేని హీరో నాగచైతన్య నటించిన ‘దోచేయ్‌’ సినిమా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.‘స్వామిరారా’ సినిమా తర్వాత సుదీర్‌ వర్మ తెరకెక్కించిన ‘దోచేయ్‌’ సినిమాపై కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంటుంది.దాంతో ఏప్రిల్‌ 17న ‘ఓకే బంగారం’ మరియు ‘దోచేయ్‌’ సినిమాల మధ్య టఫ్‌ ఫైట్‌ జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు