కార్తిక మాసంలో ఆంబోతునకు పెళ్లి చేస్తే ఏమవుతుందో తెలుసా..?

పూర్వం నైమిశారణ్యమునకు సుతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులుసత్కరించి సంతోషపరిచి చేసి కైవల్యదాయకము అయినా కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు.

వారి కోరికను మన్నించిన సూతమహర్షి ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కందా, పద్మా పురాణాలు రెండిట కూడా లిఖించారు.

ఆంబోతు అచ్చు వేసి పెండ్లి చేయడం వల్ల కలిగే పుణ్యఫలాన్ని 14 అధ్యాయంలో వెల్లడించారు.వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చున్న బెట్టుకొని కార్తీకమాస మహత్యమునకు గురించి వాక్యమును గురించి తనకు తెలిసినా సర్వ విషయములు ఇట్లు చెప్పెను.

ఓ రాజా కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణాతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వల్ల వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపాలు దూరం అవుతాయని తెలియజేశారు.అలాంటి వారికి కోటి యాగములు చేసిన పుణ్యఫలము దక్కుతుంది.ప్రతి మానవుని పితృదేవతలు తమ వంశము నందు ఎవ్వరూ ఆంబోతును అచ్చు వేసి పెళ్లి చేస్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు.

ఏ వ్యక్తి అయినా ధనవంతుడైయుండి పుణ్య కార్యక్రమాలు చేయక, ధాన ధర్మాలు( Dhana dharmas ) చెయ్యక,చివరకు ఆంబోతును అచ్చువేసి పెండ్లి అయినను చెయ్యడో అటువంటి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే గాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చెయ్యను.

Advertisement

కాబట్టి ప్రతి ఏడాది కార్తీక మాసము( Kartikamasam ) లో తన శక్తి కొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంత్రం సమయంలో శివ కేశవులకు దేవాలయం నందు దీపరాధనా చేసి, ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరుసటి రోజు తమ శక్తి కొద్ది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనాన్ని అందించేవారు సర్వసుఖాలను అనుభవిస్తారని మహర్షుల వారు తెలియజేశారు.

Sp Shailaja : నేను అందుకే ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించాను
Advertisement

తాజా వార్తలు