దేవ దేవతలలో ఆది దేవుడైన వినాయకుడికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.భక్తితో వినాయకుడిని ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుస్తాడు.
సాధారణంగా మనం విష్ణుమూర్తిని పది అవతారాలలో పూజిస్తాము.కానీ వినాయకుడిని అంతకన్నా ఎక్కువగా ఏకంగా 32 రూపాలలో పూజిస్తాము.
అయితే రూపాలు వేరైనా దైవం మాత్రం ఒక్కటే.ఈ విధంగా 32 రూపాలలో 16 రూపాలు ఎంతో ప్రత్యేకమైనవి.
ఈ క్రమంలోనే ఒక రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం వల్ల ఒక్కో విధమైన ఫలితం కలుగుతుందని ముద్గల పురాణంలో చెప్పబడింది.
ఈ విధమైనటువంటి వినాయకుడి రూపాలలో తరుణ గణపతి రూపం ఒకటి.
వినాయకుడి 32 రూపాలలో తరుణ గణపతి రూపం రెండవ రూపం.తరుణ అంటే యవ్వనం అని అర్థం.
ఈ రూపంలో వినాయకుడికి ఎనిమిది చేతులను కలిగి ఉంటాడు.తరుణ రూపంలో ఉన్న వినాయకుడిని పూజించడం వల్ల మనకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి, అదే విధంగా శుభ కార్యాలలో ఆటంకం కలుగుతున్న,ఉద్యోగ అవకాశాలు చేతి వరకు దొరికి చేజారిపోతున్న అలాంటి వారు ఈ తరుణ గణపతిని పూజించడం వల్ల వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
తరుణ గణపతి శరీరం ఎర్రగా ఎంతో కాంతి వంతంగా ఉంటుంది.ఎరుపు రంగు యవ్వనాన్ని,ఉత్తేజానికి ప్రతీక కనుక ఈ స్వామివారిని తరుణ గణపతి అని పిలుస్తారు.వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బుధవారం, సంకష్టహర చతుర్దశి రోజు, వినాయక చవితి రోజు ఈ తరుణ గణపతిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా మనం చేపట్టిన కార్యంలో ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా, అనుకున్న పనులు కూడా నెరవేరుతాయని స్కంద పురాణంలోనూ, వామన పురాణంలోనూ, బ్రహ్మ పురాణంలో కూడా తెలియజేయడమైనది.
అందుకే అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఆయురారోగ్యాలతో ఉండాలన్న తప్పనిసరిగా తరుణ గణపతికి పూజ చేయాలని ఈ పురాణాలు తెలియజేస్తున్నాయి.