కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందుతోన్న `ది ఘోస్ట్` భారీ షెడ్యూల్ దుబాయ్లో ప్రారంభం

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` షూటింగ్ దుబాయ్ లో తిరిగి ప్రారంభమైంది.ఇది సుదీర్ఘమైన షెడ్యూల్.

 King Nagarjuna, Praveen Sattaru's Combination 'the Ghost` Big Schedule Starts In-TeluguStop.com

సినిమాలోని ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్.ఈ షెడ్యూల్ లో నాగార్జున సరసన కథానాయిక గా నటించడానికి ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా బృందం తో జాయిన్ అయింది.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ను కూడా టీమ్ ఆవిష్కరించింది.

నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే.కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్లు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో భాగం కావడం ఆనందం గా ఉంది.ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ పాత్రలో నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రం లో ప్రధాన తారాగణం.

ముఖేష్ జి కెమెరా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ స్టంట్ డైరెక్టర్లు.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube