పుష్ప కోసం గట్టిగానే లాగుతున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పకోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గతేడాది అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఈ ఏడాది ‘పుష్ప’ చిత్రంతో తన జైత్రయాత్రను కొనసాగిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 Allu Arjun Remuneration For Pushpa, Allu Arjun, Sukumar, Pushpa, Tollywood News-TeluguStop.com

అయితే ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశాన్ని అందుకున్నాయి.ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆతృతగా ప్రేక్షకుల్లో నెలకొంది.

కాగా ఈ సినిమాలో పుష్పరాజ్ అనే ఊరమాస్ పాత్రలో బన్నీ మేకోవర్ ఎలా ఉండబోతుందో మనం ఇప్పటికే పోస్టర్స్, టీజర్ల రూపంలో చూశాం.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమా కోసం బన్నీ భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.65 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.బన్నీ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.

ఇక పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఏకంగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీని సృష్టిస్తుందా అని అందరూ లెక్కలు వేస్తున్నారు.స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే పుష్ప చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube