ఈ ఫోటోలో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు ఎవరో తెలుసా?

ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఎలా చరిత్ర సృష్టిస్తారో తెలియదు.ఎవరినీ ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు.

వారిలో ఉన్న గొప్ప టాలెంట్ ఏంటి అనేది తెలియక అంచనా వేస్తుంటారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడిని తీక్షణంగా చూస్తే సినీ పరిశ్రమలో ఎవరో ఒక దిగ్గజ దర్శకుడు గుర్తుకు వస్తున్నారా.

వైవిధ్య మైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని నిర్దేశించుకున్న దర్శకుడు, అలాగే తాను సినిమాలు తెలుగు జనాలకు అర్థం కావు అనే విమర్శలు రావడంతో రంగస్థలం సినిమాతో తానేంటో రుజువు చేసి తనను విమర్శించిన వాళ్ళ నోరు మూయించిన దర్శకుడు సుకుమార్.సినిమా పరిశ్రమకు రాకముందు తన స్నేహితుడితో కలిసి తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఊర మాస్ సినిమా పుష్ప చిత్రీకరణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే రంగస్థలం లాంటి మాస్ సినిమా తరువాత అంతకు మించిన మాస్ కథాంశంతో వస్తున్న పుష్ప సినిమా కోసం సుకుమార్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Advertisement

ప్రస్తుతానికి సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత లేకున్నా పుష్ప సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.దీనిపై ఇప్పటికీ సుకుమార్ స్పందించకున్నా త్వరలో దీనికి సంబంధించిన అప్ డేట్ ఏదో ఒకటి ఉండనుందని తెలుస్తోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు